Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Cashew Benefits for male : వీర్య కణాల కదలికలో జీడిపప్పుదే ప్రధాన పాత్ర..!

Cashew Benefits for male : జీడిపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే వీటిని రోజూ మన ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇలా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.

ఇదిలా ఉంటే జీడిపప్పును రోజు తీసుకోవడం వల్ల సంతానం కలుగుతుందని కొందరు చెప్తున్నారు. ఇవి తీసుకుంటే నిజంగా నే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయా లేదా అనేది ఓసారి తెలుసుకుందాం. వీటితో పాటే జీడి పప్పులో ఉండే పోషకాలు గురించి కూడా ఓ లుక్కేద్దాం.

cashew-plays-a-major-role-in-the-movement-of-sperm

జీడిపప్పులో ఎక్కువగా శరీరానికి కావాల్సిన కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఉంటాయి. ఇవి మన శరీరానికి మంచి చేస్తాయి. వీటితో పాటే విటమిన్​ కే, విటమిన్​ ఈ లు కూడా ఉంటాయి. వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. అంతేగాకుండా క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు పెడుతుంటారు.

Advertisement

జీడిపప్పు  తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతాగాకుండా ఇవి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తాయిని పేర్కొన్నారు. జీడిపప్పులో (cashew benefits for male) యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. దీంతో కరోనా లాంటి వాటిని కూడా మనిషి ఎదుర్కొగలడు.

Cashew Benefits for Sperm : జీడిపప్పుతో పురుషుల్లో వీర్యకణాల వృద్ధి..

జీడిపప్పును కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో ఆహారం కూడా తక్కువ తీసుకుంటాం. అందుకే ఇది డైట్​లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సజిషన్ గా చెప్పవచ్చు. దీంత మంచి ఫలితాలు పొందిన వారు కూడా ఉన్నారు.

ఇక సంతానం విషయానికి వస్తే… జీడిపప్పును (cashew benefits for female) తినేవారిలో సంతానంకు కొదవ లేదని స్పెయిన దేశానికి చెందిన నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది. అసలు లేని వారు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు వారు తెలిపారు. రోజూ ఒక గుప్పెడు తీసుకుంటే వీర్యకణాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. అవి చివరకు బాగా వృద్ధి అంతిమంగా సంతాన సాఫల్యానికి మార్గమని తేల్చారు.

Advertisement

Read Also : Elon Musk: ఎలన్ మస్క్​‌కు పోటీగా ఎయిర్‌టెల్​ ఏం చేసిందంటే..?

Exit mobile version