G
Telugu News » Health News » barley tea health benefits for beauty skin in telugu
⚡ Health News, Latest

Barley Tea Uses : బార్లీ ‘టీ’తో ముఖంపై ముడతలు మాయం.. ఎప్పుడూ యవ్వనంగా ఉంటారట! 

Barley Tea Uses : కొందరిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ మొహంపై ముడతలు వస్తుంటాయి. చర్మం తన సహజత్వాన్ని కోల్పోయి డెడ్ స్కిన్‌లా మారడంతో ముడతలు కనిపిస్తాయి.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Barley Tea Uses : కొందరిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ మొహంపై ముడతలు వస్తుంటాయి. చర్మం తన సహజత్వాన్ని కోల్పోయి డెడ్ స్కిన్‌లా మారడంతో ముడతలు కనిపిస్తాయి. వృద్ధాప్యం వచ్చాక చర్మం ముడతలు పడితే ఏమీ కాదు. కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ముడతలు వస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ వెక్కిరించడం మొదలు పెడతారు. దీంతో నలుగురితో కలిసి బయటకు వెళ్లాలన్నా.. కలిసి ఉండాలన్నా వెనుకాముందు ఆలోచించాల్సి వస్తుంది. అయితే, కొందరు స్కిన్ త్వరగా ముడతలు పడకుండా ఉండేందుకు చాలా రకాల రసాయనాలతో కూడిన క్రీమ్స్ వాడుతుంటారు.

Barley Tea Beautytips

దాని బదులు ఇంట్లోనే చక్కగా రెమిడీ తయారు చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసం బార్లీ గింజలను వాడాలని వెల్లడించారు. బార్లీ గింజలు చర్మానికి కాంతివంతంగా చేయడంలో దోహదపడుతుందని, అందులో చాలా ఔషధగుణాలు ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

 కొరియన్స్ చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు బార్లీతో తయారు చేసిన ప్రత్యేకమైన ‘టీ’ని తాగుతారట.. ఇలా చేయడం వలన వీరి స్కిన్  కాంతివంతంగా మెరవడంతో పాటు ఫిట్ గా కనిపిస్తుందట. ఆ టీని మనం కూడా తయారు చేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. అందుకోసం ఏమి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Barley Tea Uses : బార్లీ ‘టీ’తో బ్యూటీ టిప్స్ మీకోసం..   

ఒక  కప్పలో నీటి తీసుకుని బాగా మరిగించాలి. అందులో రెండు రెండు టేబుల్ స్పూన్ల రోస్టెడ్ బార్లీ గింజలను వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నని సెగ మీద ఐదు నిమిషాల పాటు నీటిని వేడిచేసుకోవాలి. అనంతరం నీటిని వడబోసి చల్లారాక తాగాలి. ఇలా రెగ్యులర్‌గా తాగుతుండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ముసలి మొహం రాకుండా ఉంటుందట..

బార్లీ గింజల నుంచి తీసిన ఆయిల్ కూడా చర్మాన్ని ఫిట్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీనిని ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ ఆయిల్‌తో మృదువుగా మర్దన చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ లాగా కూడా రాసుకుని కొద్ది సేపటికి కడిగేసుకుంటే చర్మం చాలా సాఫ్ట్‌గా తయారవుతుందని చెబుతన్నారు.

Advertisement

కొరియన్స్ ఎక్కువగా తమ చర్మ సౌందర్యం కోసం బార్లీ ద్వారా తయారు చేసిన ఎస్సెన్షియల్స్‌ను వాడుతారని తెలిసింది. బార్లీ ఆయిల్, నీటిలో మరిగించిన మిశ్రమాన్ని తరుచుగా చర్మానికి రాసుకుంటే ఫ్రీ రాడికల్స్, స్కిన్ డిసీసెస్ రాకుండా ఉంటాయట..

Read Also : Health Tips : బరువు తగ్గాలి అనుకునే వారికి బెస్ట్ టిప్ ఇదే… ట్రై చేయండి!

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Barley Tea Beautytipshome remedies
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు