...

Ashwagandha Benefits : ఈ చూర్ణంతో ఎన్ని వ్యాధులైనా తోకమూడవాల్సిందే.. మూలికల్లో మొనగాడు అశ్వగంధ!

Ashwagandha Benefits : ఆయుర్వేదంలో ఎన్నో మూలికలు ఉన్నాయి. కానీ, అందులో మూలికలకు రారాజుగా పేరొందిన ఆశ్వగంధ కలిగే అద్భుత ప్రయోజనాలు గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మూలికలకే మొనగాడు ఈ అశ్వగంధ ఔషధ ఉపయోగాలు కూడా తెలిస్తే అసలు వాడకుండా వదిలిపెట్టరు. ఇంతకీ ఈ అశ్వగంధతో ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అశ్వగంధ.. ఈ మూలికను తెలుగులో ‘పెన్నేరు దుంప’గా పిలుస్తుంటారు. అంతేకాదు.. వాజీకరి, కామరూపిణి, బల్య అనే పేర్లు కూడా ఉన్నాయి. పెన్నేరు క్షుప జాతి చెట్టుకు చెందిన ఈ అశ్వగంధ నేల నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. గుబురుగా కొమ్మలు కలిగి ఉంటుంది.

Advertisement
how to use ashwagandha powder in telugu
how to use ashwagandha powder in telugu

ఆకులు చూడటానికి గుండ్రంగా ఉంటాయి. ఈ చెట్ల ఆకుల కొనల వద్ద ఉమ్మెత్త ఆకుల మాదిరిగా మందంగా ఉంటాయి. ఈ ఆశ్వగంధ చెట్లకు తెల్లగా ఉండే పువ్వులు పూస్తాయి. దీని కాయలు పచ్చిగా ఉన్న సమయంలో ఆకుపచ్చని రంగులో ఉంటాయి. అదే పండిన అనంతరం మాత్రం కాయలు ఎర్రగా కనిపిస్తాయి. కాయలో అనేక బీజాలు ఉంటాయి. నేలలో పాకే ఈ చెట్ల దుంపలు చిన్న ముల్లంగి దుంప మాదిరిగా పొడవు పెరుగుతాయి. దుంపలు మృదువుగా కనిపిస్తాయి. ఈ చెట్ల దుంపలను బాగా ఎండపెట్టి.. ఆవుపాలలో శుద్ది చేస్తారు. ఆ తర్వాత ఆయుర్వేద ఔషధాలలో వాడుతుంటారు. ఈ పెన్నేరు దుంప తినడానికి కారంగా ఉంటుంది. అలానే వేడిగానూ, చేదుగానూ ఉంటుంది. ఈ అశ్వగంధకు భారత సర్వరోగ నివారిణిగా పేరుంది. తెలుగులోనూ ఓ సామెత ఉందండోయ్.. ‘పేరులేని రోగానికి పెన్నేరే మందు’ ఇప్పటికే వినే ఉంటారు.

Advertisement

Ashwagandha Benefits : ఆశ్వగంధ ఔషధ ప్రయోజనాలివే :

* అశ్వగంధ పచ్చి ఆకు రసాన్ని తీయాలి.. ఆ రసాన్ని వ్రణాలు ఉన్న చోట రాస్తే వెంటనే తగ్గిపోతాయి.
* గండమాల అనే వ్యాధిని తగ్గించగల గుణం ఉంది.
* రక్తాన్ని బాగా శుద్ది చేస్తుంది. బొల్లి, కుష్టు, చర్మ సమస్యలు ఉన్నవారు ఈ ఔషధం వాడొచ్చు.
* ఇతర ఔషధాలతో పాటు ఈ రసాన్ని కూడా వాడుకోవచ్చు.
* చర్మసంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తగ్గిపోతాయి.
* శరీరంలో వాతాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
* అశ్వగంధ తరచుగా వాడటం ద్వారా తొందరగా వృద్ధాప్యం రాదు.
* చర్మాన్ని మెురిసేలా కాంతివంతం చేస్తుంది.

Advertisement
how to use ashwagandha powder in telugu
how to use ashwagandha powder in telugu

* సయాటికా నొప్పులు, మైగ్రేన్, మోకాళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారికి ఈ అశ్వగంధ చూర్ణం మంచి రిలీఫ్ కూడా..* శరీరంలోని కఫంతో బాధపడేవారు అశ్వగంధని వాడటం వల్ల కఫం వెంటనే కరిగిపోతుంది.
* మహిళల్లో గర్భాశయ దోషాలను నివారించగలదు. తొందరగా గర్భం ధరించగలదు.
* అశ్వగంధని ప్రతిరోజు వాడటం ద్వారా శరీరంలో టాక్సిన్స్, వ్యర్ధ పదార్దాలు బయటకు వెళ్లిపోతుంది.
* అశ్వగంధ పచ్చి దుంపను నూరి రాస్తే.. మొండి వ్రణాలు వెంటనే మానిపోతాయి.
* అశ్వగంధ ఆకులపై ఆముదాన్ని రాసి వెచ్చబెట్టాలి. రాచపుండ్లు, గడ్డలు వెంటనే కరిగిపోతాయి.
* అశ్వగంధ ఆకులతో పలచటి కషాయంతో జ్వరం వెంటనే తగ్గిపోతుంది.
* పొట్ట ఉబ్బసంతో బాధపడేవారికి అశ్వగంధ పండ్లను తినిపిస్తే.. మూత్రం వెంటనే బయటకు వెళ్లిపోతుంది.
* అశ్వగంధ చూర్ణంతో ఆవునెయ్యి, పటికబెల్లం చూర్ణం మూడు బాగాలుగా చేయాలి. దీన్ని తింటంటే మంచి నిద్ర పడుతుంది.
* శుద్ది చేసిన పెన్నేరు చూర్ణం పాలలో కలిపి ఇస్తే పిల్లలు బలంగా తయారవుతారు.
* ఏడాది దాటిన పిల్లలకు దేశివాళి ఆవునెయ్యితో లేదా తేనెతో కలిపి ఇస్తుంటే పిల్లలు బలంగా తయారవుతారు.
* పక్షవాతం వచ్చినవారు ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఉదయంపూట, సాయంత్రం రెండుపూటలా తీసుకుంటే నరాలు బలంగా మారుతాయి.
* తెల్లబట్ట, అతిరక్తస్రావం సమస్యలతో బాధపడే మహిళలు ఈ అశ్వగంధ చూర్ణాన్ని వాడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* ఈ అశ్వగంధ థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు అద్భుత ఔషధంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

ముఖ్య గమనిక : శుద్ధిచేసిన అశ్వగంధను మాత్రమే వాడాలి. 11 సార్లు దేశీవాళి ఆవుపాలతో మాత్రమే శుద్ది చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో లభించే చూర్ణంతో కేవలం 40శాతం మాత్రమే ఫలితాలను ఇస్తుంది 100 శాతం ఫలితాలు పొందాలంటే శుద్ది అయిన అశ్వగంధ చూర్ణాన్ని వాడాల్సి ఉంటుంది. మార్కెట్లో లభించే చూర్ణం లేత కాఫీ కలర్ లో కనిపిస్తుంది. అదే శుద్ది చేసింది అయితే తెల్లగానూ క్రీం కలర్ లో కనిపిస్తుంది. శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణాన్ని ఆయుర్వేద వైద్యుల సలహాలతో మాత్రమే వాడుకోవాలి.

Advertisement

Read Also :  Manchineel Tree Dangerous : మనిషి ప్రాణాలు తీసే చెట్టు.. అంతా విషమే.. గాలి పీల్చినా, నీటి చుక్క పడినా ప్రాణాలు పైకే!

Advertisement
Advertisement