Manchineel Tree Dangerous : అదో విషపూరితమైన చెట్టు.. అంతా విషమే.. మనిషి ప్రాణాలు తీసేయగలదు. ఈ చెట్టు పైనుంచి నీటిబిందువు మీదపడితే ప్రాణాలు తీసేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వింతైన చెట్టు జీవుల ప్రాణాలను తీసేస్తుంది. మాంచిల్ చెట్టుగా (Manchineel Tree)గా పేరొంది. దీనిని పాయిజన్ జామ అని కూడా పిలుస్తారు మనుషి ప్రాణాలు తీస్తున్న ఈ మన్షినల్ చెట్టు..
దక్షిణ, ఉత్తర అమెరికా సముద్రతీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చెట్టు పండ్లు, ఆకులన్నీ విషపూరితమే.. ఈ చెట్టు వదిలిన గాలి పీల్చినా ప్రాణాలు పోతాయట.. శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయట.. చెట్టును తాకితే ఒళ్లంతా బొబ్బలు వస్తాయట.. ప్రభావం ఎక్కువగా ఉంటే ప్రాణాలు కూడా పోతాయట. హిప్పోమానే జాతికి చెందిన చెట్టు.. హిప్పోమానే మాన్సినెల్లా అనేది శాస్త్రీయ నామం.. విషపూరిత పండ్లుగా పిలుస్తారు.
కరేబియన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇసుక బీచ్ దగ్గర మాంచినీల్ చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన్షినల్ చెట్టు పండ్లు కూడా అచ్చం గ్రీన్ ఆపిల్ మాదిరిగానే ఉంటాయి. బుల్లి ఆపిల్స్ (లిటిల్ ఆపిల్స్ ఆఫ్ డెత్) అని పిలుస్తారు. వర్షం కురిసినప్పుడు ఈ చెట్టు కిందికి వెళ్లకూడదు.. ఈ చెట్టుపై నుంచి నీటి బిందువు శరీరంపై జారిపడితే ప్రాణాలు పోతాయట..
చెట్ల కొమ్మలపై నుంచి తెల్లటి రసం కారుతుంటుంది. చాలా విషపూరితమైనది.. యాసిడ్ కంటే చాలా పవర్ ఫుల్.. ఒంటిపై పడితే భరించలేనంతగా మంట పుడుతుందట.. విషంతో నిండిన ఈ చెట్ల పండును కొరికి తింటే.. ప్రాణాలు పోతాయట.. ప్రపంచంలోని కరేబియన్ తీర ప్రాంతంతో పాటు ఫ్లోరిడా తీరంలో మన్షినల్ చెట్లు అధికంగా ఉంటాయి.
దాదాపు 50 అడుగుల వరకు ఈ చెట్లు ఎత్తు పెరుగుతాయి. విషపూరితమైన చెట్టు కలపను ఫర్నీచర్ తయారీలో వినియోగిస్తుంటారు. ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మరి చెట్ల కలపను సేకరిస్తారట. ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాత వాటిని కలపకు ఉపయోగిస్తారు.
Read Also : Kanuga Health Benefits : కానుగ చెట్టుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మీ ఊళ్లో కనిపిస్తే అసలు వదలొద్దు.. ఎందుకంటే?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world