Rajendra Prasad : ఇకపై అలా జరగదు.. క్రికెటర్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో!

Updated on: April 12, 2025

Rajendra Prasad : క్రికేటర్ డేవిడ్ వార్నర్‌కు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాబిన్‌హుడ్‌ మూవీలో వార్నర్‌ గెస్ట్ రోల్ చేశాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వార్నర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా క్రికెటర్‌ను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమాలో ఒక రోల్ పోషించారు.

డేవిడ్ వార్నర్‌కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు :
రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్‌ను అవమానించే వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి నెటిజన్లు నటుడిని విమర్శించారు. సోషల్ మీడియాలో రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

అసలు ఏమన్నారంటే? :
ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల, హీరో నితిన్‌ క‌లిసి డేవిడ్ వార్నర్‌ను పట్టుకొచ్చారు. క్రికెట్ ఆడమంటే పుష్ప సిగ్నేచర్ స్టెప్పులు వేస్తున్నాడు. వీడు మాములోడు కాదండి. రేయ్.. వార్నర్ నీకు ఇదే నా వార్నింగ్ అంటూ వ్యాఖ్యానించారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు వార్నర్‌కు అర్థం కాక వార్నర్ నవ్వుతూనే ఉన్నాడు. వీడియో వైరల్ కావడంతో వివాదానికి దారితీసింది.

Advertisement

సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “నాకు డేవిడ్ వార్నర్, అతని క్రికెట్ అంటే చాలా ఇష్టం. డేవిడ్ కూడా మన సినిమాలను ఇష్టపడతాడు. అందుకే ఒకరికొకరు దగ్గరయ్యాం. కానీ, వార్నర్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతున్నాను. నాకు తెలియకుండా ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. అది అనుకోకుండా జరిగినా పొరపాటు మాత్రమే”అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. %8

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel