Acharya movie updates : మెగాస్టార్ సినిమా ఐదో ఆటకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

Updated on: April 25, 2022

Acharya movie updates :  మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ చిత్ర ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రియులకు శుభవార్త వినిపించింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆచార్య ఐదో ఆటకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు అదనపు షో ప్రదర్శించుకునేలా థియేటర్ల యాజమాన్యాలకు అవకాశం కల్పించింది.

Acharya movie updates
Acharya movie updates

ఇందుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, లైసెన్స్ అథారిటీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఐదో ఆటతో పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం వేలుసు బాటు కల్పించింది. ఒక్కో టికెట్ పై మల్లీ ప్లెక్స్ లో 50 రూపాయలు, సాధారణ ఏసీ థియేటర్లలో 30 రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ధర్మ స్థలి అనే ఓ గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు.

Read Also : Acharya Bhale Bhale Bhanjara Song : ఆచార్య సినిమా న్యూ అప్ డేట్.. భలే భలే బంజారా పాట విడుదల!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel