Acharya Bhale Bhale Bhanjara Song : ఆచార్య సినిమా న్యూ అప్ డేట్.. భలే భలే బంజారా పాట విడుదల!

Acharya Bhale Bhale Bhanjara Song : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘భలే భలే బంజారా’ అనే గీతం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్​ సంభాషణతో కూడిన టీజర్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియో పంచుకుంది.

‘సిరుత పులుల సిందాట’ అంటూ సాగే ‘భలే భలే బంజారా’ గీతం ప్రోమో వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ సోషల్ మీడియాలో షేర్​ చేసింది. పూర్తి పాటను సోమవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. ‘భలే భలే బంజారా’ గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ప్రోమోలో చిరంజీవి, రామ్​చరణ్​ స్టెప్పులతో అదరగొట్టారు. అయితే ఈ సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కాబోతోంది.

Acharya Bhale Bhale Bhanjara Song
Acharya Bhale Bhale Bhanjara Song

దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్​గా చేసింది. రామ్​చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, టీజర్లు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.

Advertisement

Read Also : Megastar Chiranjeevi: ట్విట్టర్ పేరు మార్చుకున్న మెగాస్టార్… మనసును హత్తుకునే వీడియో షేర్ చేసిన చిరు!

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel