SivaSankar Master : టాలీవుడ్‌లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు..

SivaSankar Master : టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియాగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహిత శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా కరోనాతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

తమిళ, తెలుగు మూవీల్లో పదికిపైగా భాషల్లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. తన కెరీర్ లో 8వందలకు పైగా మూవీలకు కొరియోగ్రఫీ చేశారు. 1975వ సంవత్సరంలో తమిళ మూవీ భరతమమ్ మూవీతో శివశంకర్ మాస్టర్ కెరీర్ మొదలైంది. ఈ చిత్రానికి శివశంకర్ మాస్టర్ సహాయకుడిగా పనిచేశారు. కురువికూడు మూవీతో ఆయన కొరియోగ్రాఫర్ అయ్యారు.

ఒకవైపు డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. 2003లో ఆలయ్ సినిమాలో ఆయన మొదటిసారి సిల్వర్ స్ర్కిన్ పై మెరిశారు. శివశంకర్ మాస్టర్ 30 మూవీల్లో నటించారు. టీవీల్లో డ్యాన్స్ షోలకు జడ్జీగా కూడా వ్యవహరించారు. మగధీర మూవీలో ధీర.. ధీర పాటకు కూడా శివశంకర్ మాస్టర్ కొరియాగ్రఫీ చేశారు.

Advertisement

Read Also : Bigg Boss 5 Telugu : షణ్ముక్‌కు క్లాస్ పీకిన తల్లి.. అవి తగ్గించుకుంటే బెటర్ అంటూ..

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel