Samantha Warning : ప్రతి మనిషి సహనానికి, ఓపికకు ఒక హద్దు ఉంటుంది. అది మితిమీరితే అగ్నిపర్వతంలా పేలుతుంది. మౌనంగా ఉంటున్నాను కదా అని అదేపనిగా బురద జల్లాలని ప్రయత్నిస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. అంటూ సమంత ఒక పోస్టు పెట్టింది.
ఆ పోస్టును సామ్ ఎవరిని ఉద్దేశించి పోస్టు చేసిందో తెలియదు కానీ, గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. తనపై ఇటీవల ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సమంత ఈ పోస్టు పెట్టడంతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సమంత ఇంతగా సీరియస్ అవ్వడానికి కారణం ఎవరు? అసలు ఏమైందనేది మాత్రం తెలియాల్సి ఉంది. తనపై ట్రోల్స్ చేసేవారికి సమంత గట్టిగానే చురకలు అంటించింది.

నా మౌనాన్ని అజ్ఞానం అనుకోవద్దని, ప్రశాంతత కోసమే అనే విషయం గుర్తించుకోవాలంటూ పోస్టు పెట్టింది. ఏది అన్నా చూస్తు ఊరుకుంటానని అనుకోవద్దని, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, నా దయగుణాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని సమంత స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో సామ్ పోస్టు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాప్ గా మారింది. వెనువెంటనే సమంత రెండు పోస్టులను పెట్టింది.
Kindness can have an expiry date ☺️#JustSaying https://t.co/UDc40uaLpv
— Samantha (@Samanthaprabhu2) April 22, 2022
ఒక మనిషికి దయాగుణం, మంచితనానికి కూడా ఒక ఎక్స్ పెయిరీ డేట్ అనేది ఉంటుంది అని ట్వీట్ చేసింది. అయితే సామ్.. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది అనేది సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సమంత ఫ్యాన్స్‌కు, అక్కినేని ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. అందుకే సమంత ఇలాంటి పోస్టులు పెడుతుందని అంటున్నారు. ట్రోలర్లకు కౌంటర్‌గా సమంత ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఇస్తున్నారు. మీరు ఇలానే రెచ్చగొడితే అసలు మ్యాటర్ బయటపెట్టేస్తుందని, మీ పరువే పోతుందని సామ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Samantha: మొగుడు కంటే కుక్కలే ఎక్కువ… సమంతను కాజల్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!