RGV Shocking comments: కేజీఎఫ్ డైరెక్టర్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు వీరప్పన్ లాంటోడట!

RGV Shocking comments: కేజీఎఫ్.. పార్ట్1, పార్ట్ 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా టాలెంట్ ఉన్న డెరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పలు షాకింగ్ కామెంట్లు చేశారు. బుధవారం దర్శకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్మ కొన్ని వరుస ట్వీట్లు చేశారు. వీటిలో ప్రశాంత్ నీల్ పని తనాన్ని మెచ్చుకున్నారు.

“ప్రశాంత్ నీల్.. నువ్వు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఒక వీరప్పన్ లాంటి వాడివి. కేజీఎఫ్ తో కన్నడ పరిశ్రమతో పాటు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్న ప్రతి దర్శకుడి మనసును కొల్లగొట్టినందుకు దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు” అంటు ట్వీట్ చేశారు. కేజీఎఫ్-2 ఎందుకు అంత విజయం, క్రేజ్ సొంతం చేసుకుందో తెలియక చాలా మంది తమ సినిమాలను రీ షూట్, రీ డ్రాఫ్ట్, పునరాలోచన చేస్తూ… టన్నుల కొద్దీ డబ్బును వృథాగా ఖర్చు చేసేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన 95 శాతం మంది సంప్రదాయమైన వారికి కేజీఎఫ్-2 నచ్చలేదు. ప్రశాంత్ నీల్… పాతి సినీ పరిశ్రమను బయటకు నెట్టి, కొత్త సినీ పరిశ్రమకు జీవం పోశాడనటానికి ఇదే నిదర్శనం కేజీఎఫ్-2 సినిమానేనంటూ వివరించాడు.

Advertisement

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel