RGV Shocking comments: శివ సినిమా తీసిన ఆర్జీవీ ఎప్పుడో చనిపోయాడంట..!

Updated on: May 4, 2022

RGV Shocking comments: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరో సారి వార్తల్లో నిలిచారు. తాను మొదటగా దర్శకత్వం వహించిన శివ సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేసి అందరినీ షాక్ కి గురి చేశారు. అక్కినేని నాగార్జునను హీరోగా పెట్టి రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా తీసిన రాం గోపాల్ వర్మ ఎప్పుడో చనిపోయాడంటూ చెప్పాడు. అయితే ఇదంతా అలీతో సరదాగా కార్యక్రమంలో వెల్లడించారు. అయితే ఈ వారం ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఈయనతో పాటు ఇటీవలే వచ్చిన డేంజరస్ సినిమా హీరోయిన్లు అప్సర వాణి, నైనా గంగూలీ కూడా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తూ మరోసారి తన మార్కును చూపించారు. అయితే ‘మీరు సీఎం అయితే ఏం చేస్తారు’ అని ఆర్జీవీని అలీ అడగగా… ‘ ట్రెజరీలో ఉన్న డబ్బంతా తీసుకొని.. వేరే దేశానికి వెళ్లిపోతా’ అని ఆర్జీవీ సమాధానం చెప్పారు. ఈ కొత్త ఎపిసోడ్​ ఈ నెల 9న ప్రసారం కానుంది. స్వలింగ సంపర్కుల కథాంశంతో డేంజరెస్​ సినిమాను తెరకెక్కించారు రామ్ గోపాల్​ వర్మ. అయితే సినిమాపై వివాదం చెలరేగుతుండగా.. విడుదల వాయిదా పడుతూ.. వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 6న ఎలాగైనా విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఇది విడుదల కానుంది.

Advertisement

Read Also : Anchor anasuya: లైవ్ లో అనసూయ అందాల ఆరబోత.. పండగ చేస్కుంటున్న నెటిజెన్లు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel