Ravi Teja : ఆ హీరోయిన్ విషయంలో రవితేజను బాలయ్య పిలిపించాడా?.. క్లారిటీనిచ్చిన హీరో..

Ravi Teja : టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య ప్రజెంట్ ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాల లైనప్ చేసుకున్న బాలయ్య మరో వైపున తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’లో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షో హోస్ట్ చేస్తున్నారు.

ఈ షోకు తాజాగా మాస్ మహారాజా రవితేజ గెస్ట్‌గా వచ్చాడు. ఇందులో బాలయ్య తనకు రవితేజకు మధ్య వార్ జరిగినట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఓ వార్త సర్కులేట్ అవుతోందని దాని ప్రకారం.. 15 ఏళ్ల కిందట ఓ హీరోయిన్ విషయంలో రవితేజ, బాలకృష్ణ మధ్య గొడవ జరిగిందని , ఈ గొడవ విషయమై రవితేజను పిలిచి మరి బాలయ్య వార్నింగ్ ఇచ్చాడట. కాగా, ఈ వార్త అస్సలు నిజం కాదని బాలయ్య తెలిపాడు.

ఇకపోతే పని పాట లేని వారే ఇటువంటి వార్తలను సృష్టిస్తారని అందులో నిజం లేదని రవితేజ స్పష్టం చేశాడు. మొత్తంగా రవితేజ, బాలయ్య మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలకు ఇరువురు పులిస్టాప్ పెట్టేశారు. ఇక అన్ స్టాపెబుల్ షోలో రవితేజ, బాలయ్య పలు విషయాలపైన చర్చించుకున్నారు. సరాదాగా సినిమాల గురించి ముచ్చటించుకున్నారు.

Advertisement
 raviteja
raviteja

రవితేజ‌తో వర్క్ చేసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని తో తన 107వ సినిమా చేయబోతున్నట్లు బాలయ్య తెలిపాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత గోపిచంద్ మలినేని తన నెక్స్ట్ మూవీ బాలయ్యతో చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బాలయ్య తన నెక్స్ట్ పిక్చర్ ‘ఎఫ్3’ ఫేమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel