Raghu Karumanchi : మొన్నటివరకు సినిమాలు, జబర్దస్త్ కమెడియన్.. ఒక్కసారిగా బిజినెస్ మెన్‌గా అయిపోయాడు

Raghu Karumanchi : కరోనా మహమ్మారి వలన విధించిన లాక్‌డౌన్‌తో సినిమాలు, షూటింగులు ఆగిపోయాయి. దీంతో చాలా మంది నటులు, ఆర్టిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఆ కమెడియన్ మాత్రం కొత్తగా ఆలోచించాడు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా కుంగిపోలేదు. కూరగాయలు పండిస్తూ జీవనం సాగించాడు. తాజాగా కొత్త బిజినెస్ ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికీ సుపరిచితుడైన కమెడియన్ రఘు..

నటుడు రఘు మొదట్లో వెండితెరపై చాలా సినిమాల్లో కమెడియన్‌గా విభిన్న పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కెరీర్ కొంచెం నెమ్మదిగా సాగుతున్న తరుణంలో జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయ్యాడు. రోలర్ రఘు అని టీం పేరుతో ప్రేక్షకులను నవ్వించాడు. అంతా బాగానే సాగిపోతుందనుకున్న టైంలో ‘అలీతో జాలీ’గా అనే షోలోనూ కనిపించాడు.అయితే, కరోనా పీరియడ్ తర్వాత రఘు సినిమాల్లో కనిపించడం తగ్గించాడు.

ప్రస్తుతం ఈ కమెడియన్ వ్యాపారాల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ టైంలో చిన్నగా ప్రారంభించిన కూరగాయల వ్యాపారం కలిసిరావడంతో ఏకంగా పది ఎకరాల ల్యాండ్ లీజుకు తీసుకుని ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నాడట.. తాజాగా రఘు కొత్త వ్యాపారం ప్రారంభించాడని తెలిసింది. మొన్న తెలంగాణ గవర్నమెంట్ లిక్కర్ షాపుల కోసం టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Advertisement

దీంతో తన స్నేహితులు సాయిరామ్ రెడ్డి, హరినాథ రెడ్డిలతో కలిసి ‘అభినవ్ లిక్కర్’ పేరుతో నాలుగు టెండర్లు వేయగా అందులో రెండు షాపులు తనకే తగిలినట్టు చెప్పాడు రఘు. గురువారం మంచి రోజు కావడంతో మద్యం దుకాణాలను ప్రారంభించినట్టు పేర్కొన్నాడు.ఇలా కమెడియన్ నుంచి చాలా ఫాస్ట్‌గా బిజినెస్ మెన్ అవతారం ఎత్తాడు కమెడియన్ రఘు..

Read Also : RGV Comments : సిరివెన్నెలపై RGV సిల్లీ కామెంట్స్.. ‘దేవకన్య’లతో ఏంజాయ్ అంటూ..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel