Naresh Shocking Comments : అందుకే నన్ను చంపాలనుకుంది.. రమ్య రఘుపతిపై నరేష్ సంచలన కామెంట్స్!

Updated on: January 28, 2023

Naresh Shocking Comments : సీనియర్ నటుడు నరేష్ (Naresh), ఆయన భార్య రమ్యా రఘపతి (Ramya Raghupathi) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రమ్య తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందంటూ నరేష్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు నరేష్ హైకోర్టును ఆశ్రయించారు. కొంతకాలంగా ఆస్తి కోసం రమ్య తనను వేధిస్తోందని నరేష్ తన ఫిర్యాదులో తెలిపాడు.

ఆస్తి కోసమే రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వడం లేదని, అందుకే పవిత్ర లోకేష్‌ను పెళ్లి చేసుకోలేకపోతున్నానని అన్నారు. రమ్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతూ నరేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ రమ్యపై సంచలన కామెంట్స్ చేశారు. రమ్య టార్చర్ భరించలేకపోతున్నానని తనకు వెంటనే విడాకులు ఇప్పించాల్సిందిగా పిటిషన్‌లో కోరారు. రమ్య రఘుపతితో 2010 సంవత్సరంలో తనకు పెళ్లి జరిగిందని, 2012లో ఒక బిడ్డకు జన్మించారని తెలిపారు.

Naresh Shocking Comments :  విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన నరేష్.. 

Actor Naresh Shocking Comments On wife Ramya Raghupathi (1)
Actor Naresh Shocking Comments On wife Ramya Raghupathi

ఆ తర్వాత నుంచి రమ్య తనను వేధిస్తోందని నరేష్ చెప్పారు. తనకు డబ్బు వ్యామోహం ఎక్కువగా ఉందని, ఆరోపించారు. రమ్యతో తనకు ప్రాణహాని ఉందని, గత ఏడాది ఏప్రిల్‌లో అగంతకులు తన ఇంట్లోకి చొరబడి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆస్తి కోసమే రమ్య రఘుపతి నన్ను చంపేందుకు ప్రయత్నించిందని, అందుకే తన కుమారుడు ఆమె దగ్గర పెరగడం లేదని చెప్పుకొచ్చారు.

Advertisement

తన కుమారుడికి తానే గార్డియన్‌గా ఉంటానని నరేష్ కోర్టుకు తెలిపారు కుమారుడి చదువుల నిమిత్తం ఏడాదికి 4 లక్షలు ఖర్చు చేస్తున్నానని నరేష్ తెలిపారు. రమ్య రఘుపతి కారణంగా కుమారుడి జీవితం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి తానే గార్డియన్‌గా ఉంటానని చెప్పారు. నరేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతున్నాయి.

Read Also : Viral Video : చీరకట్టులో నడుము అందాలను చూపెడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యువతి.. వీడియో వైరల్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel