Minister Roja Dance : ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పటి మంత్రి రోజా సెల్వమణి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రేమ తపస్సు చిత్రంలో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి. సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారి స్టార్ హీరోలతో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అక్కడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఆమె మంత్రి పదవిలో కొనసాగుతుంది. మొన్నటి వరకూ ఎమ్మెల్యేగా చేస్తూనే… మరో వైపు జబర్దస్త్ షోలో పాల్గొంది. దాదాపు పదేళ్ల పాటు ఆ షోలో జడ్గిగా చేస్తూ… తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తాజాగా ఆమె మంత్రి కావడంతో జబర్దస్త్ షోలో పాల్గొననంటూ తెలిపింది. కేవలం తాను ప్రజా సేవకే అంకితమని వివరించింది. అయితే ఎప్పటికప్పుడు ఆమె ఫోటులు, న్యూ అప్ డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా చాలా బాగుంది… ఇప్పటికై అదే అందం.. డ్యాన్స్ లోనూ అదే గ్రేస్ అంటూ ప్రశంసిస్తున్నారు.
Read Also : R.K Roja : వామ్మో.. జబర్దస్త్ జడ్జిగా రోజా అన్ని కోట్లు సంపాదించారా?















