Manishankar: డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన ‘మణిశంకర్’ టీజర్!

Manishankar: తాజాగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ విడుదల చేసిన ‘మణిశంకర్’ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్ వెంకట్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శివ కంఠమనేని, సంజనా గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య, మాణిక్య రెడ్డి, సుబ్బరాజ్ శర్మ, అరోహి నాయుడు తదితరులు నటించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై కె. ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాస రావు, ఎం ఫణి భూషణ్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు బాగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ విడుదల చేశాడు. పైగా కొన్ని విషయాలు కూడా తెలిపాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ బాగున్నాయని.. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ చేసినట్టు అనిపించిందని అన్నాడు.

అంతే కాకుండా ఈ సినిమా డైరెక్టర్ వెంకట కృష్ణన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మంచి పాజిటివ్ డైరెక్టర్ అని అన్నాడు. ఆయన అందరికి మంచి జరగాలనే కోరుకునే వ్యక్తి అని అన్నాడు. ఆయన చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సినిమా మంచి కంటెంట్ తో పాటుయాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందుతుందని అన్నాడు.

Advertisement

ఇక ఈ సినిమా హీరో శివ కంఠమనేని కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా టీజర్ తప్పకుండా అందరికీ నచ్చుతుందనే భావన ఉందని అన్నాడు. మణిశంకర్ అనే ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ చేసే డీలింగ్స్ కి సంబంధించిన కథ అని తెలిపాడు. ఇక ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయని అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందని అన్నాడు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel