Krithi shetty: ఆయనపై కృతికి క్రష్ అంట… చాలా ఇష్టం అంటూ హాట్ కామెంట్లు!

Krithi shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కత్త హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి షెట్టి ముందుంటారు. మొదటి సినిమాతో హిట్టు కొట్టిన ఈ హీరోయిన్.. తన అందం, అభినయంతో వరసు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే తాజాగా ఈమె రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న వారియర్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా జులై 14వ తేదీ అంటే రేపే రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే కృతి షెట్టి ప్రమోషన్లలో పాల్గొంటు మరింత బిజీగా గడుపుతోంది. ఈ ప్రమోషన్లలోనే కొన్ని కామెంట్లు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె రామ్ గురించి ఏం మాట్లాడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తన సెలబ్రిటీ క్రష్ ఎవరని అడగ్గా… శివ కార్తికేయన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనంటే క్రష్ అని తెలిపింది. అంతే కాకుండా తమిళం నేర్చుకునేందుకు శివ కార్తికేయన్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటారట. అయితే కృతి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈమె తెలుగులో నితిన్, నాగ చైతన్య సినిమాలతో పాటు తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న అచలుడులో హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel