Jeevitha – Roja: నటిరోజాపై కౌంటర్ వేసిన జీవిత… షాక్‌లో జబర్దస్త్ జడ్జ్!

Updated on: March 16, 2022

Jeevitha – Roja : హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలిగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా జడ్జిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా గురించి అందరికీ తెలిసిందే జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ కమెడియన్స్ కి తనదైన శైలిలో వారిపై పంచులు వేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు.ఇలా అందరి పై కౌంటర్లు వేసే జబర్దస్త్ జడ్జి రోజా పై మరొక ఫైర్ బ్రాండ్ జీవిత రాజశేఖర్ దారుణమైన కౌంటర్లు వేశారు. ఇలా జీవిత వేసిన కౌంటర్ కి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక రోజా ఎక్స్ప్రెషన్ మొత్తం మారిపోవడమే కాకుండా షాక్ లో ఉండిపోయారు.

jeevitha-countered-on-roja-jabardast-judge-in-the-shop
jeevitha-countered-on-roja-jabardast-judge-in-the-shop

ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే…ఏదైనా పండుగ వస్తుందంటే చాలు ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ టీవీ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఉగాది పండుగ దగ్గర్లో ఉండడంతో ఈటీవీ వారు అంగరంగ వైభవంగా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ జడ్జి రోజా ఎప్పటిలాగే తనదైన శైలిలో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మరొక హీరోయిన్ జీవిత రాజశేఖర్ హాజరయ్యారు. ఇలా వీరిద్దరూ కలిసి జబర్దస్త్ కమెడియన్స్ తో కలిసి ఎంతో సందడి చేశారు. ఈ క్రమంలోనే రోజా డైలాగ్ చెపుతూ.. నిన్ను చూస్తే నా నరాలు లాగేస్తున్నాయని చెప్పగా ఏ యాంగిల్లో అమ్మా అంటూ జీవిత నటి రోజా పై కౌంటర్ వేశారు. ఇలా జీవిత పై కౌంటర్ వేయడంతో తనకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక మొహం పక్కకు తిప్పుకొని తెల్లమొహం వేసారు. జబర్దస్త్ కార్యక్రమంలో అందరి పై పంచులు వేసే రోజాకు జీవిత సరైన పంచ్ వేశారని అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.

Advertisement

Read Also : Rashmika Mandanna: ఐటమ్ సాంగ్ చేయడం కోసం భారీ మొత్తంలో డిమాండ్ చేసిన శ్రీవల్లి.. ఏకంగా అన్ని కోట్లా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel