Jabardasth Getup Srinu : విమర్శలపై నోరువిప్పిన గెటప్ శీను.. బిల్డప్ బాబాయ్ అంటూ ఏడుకొండలకు స్ట్రాంగ్ కౌంటర్..

Updated on: July 21, 2022

jabardasth Getup Srinu : కిరాక్ ఆర్పి తో మొదలైన జబర్దస్త్ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ మల్లెమాల నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి పై ఆర్పి తీవ్ర విమర్శలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఫుడ్ రెమ్యూనరేషన్ వంటి విషయాలలో ఆర్టిస్టులకు అన్యాయం చేసినట్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆర్పి వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం రేపాయి. ఇంకా సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్యాం ప్రసాద్ రెడ్డి ని ఆ విధంగా విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆర్ పి చేసిన విమర్శలను హైపర్ ఆది మరియు ఆటో రాంప్రసాద్ లు ఖండించారు. ఆర్ పి చెబుతున్న దాంట్లో నిజం లేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక షేకింగ్ శేషు అయితే ఆర్ పి ని ఓ రేంజ్ లో విమర్శించాడు.

jabardasth Getup Srinu Strong Counter To Jabardasth Yedukondalu
jabardasth Getup Srinu Strong Counter To Jabardasth Yedukondalu

అతన్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం జరిగింది.  ఇక జబర్దస్త్ ద్వారా అత్యంత పాపులారిటీ తెచ్చుకున్న గెటప్ శ్రీను మరియు సుధీర్ లు ఈ విషయంపై నోరు విప్పలేదు. అయితే జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు ఎంట్రీతో గెటప్ శ్రీను స్పందించారు. నేరుగా, పరోక్షంగా ఏడుకొండలపై కౌంటర్లు విసిరాడు. జబర్దస్త్ ఆరంభం నుండి మేనేజర్ గా ఉన్న ఏడుకొండలు అసలు షో ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ వంటి అనేక విషయాలను బయట పెట్టాడు.

కిరాక్ ఆర్ పి ని వాన్ని ఒకప్పుడు నాతో మాట్లాడాలంటేనే భయపడేవాడు. అలాంటివాడు శ్యాం ప్రసాద్ రెడ్డి ని విమర్శించడానికి వాడికి ఏమి అర్హత ఉంది. అంటూ నేరుగా కౌంటర్లు వేశాడు. అంతేకాకుండా గెటప్ శీను మరియు సుదీర్ ల మీద కూడా విమర్శలు చేశాడు. మొదట్లో వీరిద్దరిని ఓంకార్ జబర్దస్త్ నుండి బయటకు తీసుకు పోయే ప్రయత్నం చేశాడు కానీ నేను వాళ్లతో మాట్లాడి డబ్బులు కూడా ఇప్పించాను. అంతేకాకుండా టీమ్ లీడర్స్ ని చేస్తానని హామీ ఇచ్చాను.

Advertisement

గెటప్ శీన హామీ ఇచ్చాను. గెటప్ శీను కార్ కావాలంటే వాడికి నా కార్ ఇచ్చాను. అంతేకాకుండా సుడిగాలి సుధీర్ కి లైఫ్ ఇస్తే కనీసం వాడు నా ఫోన్ కూడా ఎత్తట్లేదు సినిమాలు అంటూ బయటకు వెళ్ళిపోయాడు. వాడు తీసిన సినిమా ఒక్కటైన ఆడిందో చెప్పమనండి అంటాడు. ఇంటర్వ్యూలో ఏడుకొండల ని ఒకసారి సుధీర్ కి కాల్ చేయండి అంటూ యాంకర్ అడగగా ఏడుకొండలు కాల్ చేస్తాడు. కానీ సుధీర్ కాల్ లిఫ్ట్ చేయడు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం కాల్ చేస్తే మేనేజర్ తో మాట్లాడమన్నాడు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడు.

ఏడుకొండలు చేసిన ఆరోపణలకు గెటప్ శ్రీను గట్టి కౌంటర్ ఇచ్చాడు. అమ్మాను అనడానికి ఇచ్చాను అనడానికి చాలా తేడా ఉంది అంటూ కామెంట్ చేసి ఎమోజీ లు పెట్టాడు. తనేదో ఫ్రీ గా ఇచ్చినట్లు చెప్తున్నాడని కౌంటర్ వేశాడు. ఇక నేను జబర్దస్త్ లో చేసిన బిల్డప్ బాబాయ్ పాత్రకు ఇతడు కరెక్ట్ గా సరిపోతాడని ఏడుకొండల గురించి ఎగతాళిగా మాట్లాడతాడు. ఈ విధంగా గెటప్ శీను జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండల గురించి చేసిన విమర్శలు నెట్టింట వైరల్ గా మారాయి.

Read Also : Jabardasth Yedukondalu : అందుకే.. నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడా..? అసలు నిజాలు బయటపెట్టిన ఏడుకొండలు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel