Hero surya : ఆస్కార్ నుంచి సూర్యకు ఆహ్వానం.. సౌత్ ఇండియాలోనే తొలి హీరోగా రికార్డు!

Updated on: June 29, 2022

Hero surya : తమిళ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. గజిని సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్కున్న ఆయన.. తన అభినయంతో అందరి ప్రశసంలు దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆయన నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుదలవుతున్నాయి. ఇటీవలే విక్రమ్ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ పోషించాడు. రోలెక్స్ పాత్రలో కేవలం నాలుగైదు నిమాషాలు మాత్రమే కనిపించి తన నట విశ్వరూపంతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు. అయితే తాజాగా ఆయనకు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం వచ్చింది.

Hero surya invited to join the presigious academy of motion picture arts and sciences
Hero surya invited to join the presigious academy of motion picture arts and sciences

సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించేది ఆస్కార్ అవార్డు. జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ తీస్కోవాలని సినీ ప్రముఖులు విపరీతంగా ఆరాట పడుతుంటారు. అయితే సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్కార్ 2022 అవార్డు ఫంక్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 397 మందికి ఆహ్వానం రాగా.. అందులో సూర్య ఒకరు. ఇందులో విశేషం ఏంటంటే.. సౌత్ ఇండియా నుండి మెంబర్ ఆఫ్ అకాడమీ అవార్డుకు ఆహ్వానం అందిన మొదటి హీరోగా సూర్య నిలిచారు. బాలీవుడ్ నుండి కాజల్ కు అందినట్లు సమాచారం.

Read Also : Hero Surya Video : సరికొత్తగా అభిమానులకు విషెస్.. సూర్య అంటే మామూలుగా ఉండదు మరి!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel