Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Prabhas Special Treat : శృతి హాసన్ కోసం ప్రభాస్ ఇంటి నుంచి బాహుబలి మీల్స్.. థాంక్యూ డార్లింగ్ అంటూ రిప్లై!

Prabhas special treat : రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్తగా చేస్తున్న సినిమా సలార్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అ

By Vinod Kumar

Published on: May 29, 2022 5:07 PM

Updated on: May 29, 2022 5:51 PM

hero-prabhas-special-treat-for-shruthi-hasan

---Advertisement---

Prabhas special treat : రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్తగా చేస్తున్న సినిమా సలార్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అయితే తనతో పాటు షూటింగ్ లో పాల్గొనే వారికి లేదా తనకు బాగా నచ్చిన వారికి హీరో ప్రభాస్ తన ఇంటి వంటకాలను రుచి చూపించడం గురించి మనందరికీ తెలిసిందే. అయితే సలార్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న హీరోయిన్ శృతి హాసన్ కోసం ప్రభాస్ తన ఇంటి నుంచి బాహుబలి మీల్స్ పంపించారు. అది చూసిన శృతి ఆనందంతో పాటు ఆశ్చర్యపోయిందట.

hero-prabhas-special-treat-for-shruthi-hasan
hero-prabhas-special-treat-for-shruthi-hasan

అంతే కాదండోయ్ అందులో ఉన్న దాదాపు 20 కి పైగా రకాల వంటకాలను ఆవురావురుమంటూ ఇష్టంగా తిందట. ఇంత టేస్టీ ఫుడ్ నా కోసం పంపినందుకు థాంక్యూ డార్లింగ్ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ప్రభాస్ అంటే మామూలుగా ఉండదు మరి అంటు కామెంట్లు చేస్తున్నారు.అలాగే ఆ వీడియోలో ఉన్న వంటకాలను చూస్తే మాక్కూడా నోరూరుతుందని చెబుతున్నారు.

Advertisement

Read Also : 

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.