NTR : ఎన్టీ రామారావు గారిని ఎవరు దత్తత తీసుకున్నారో మీకు తెలుసా..?

Updated on: August 4, 2025

NTR : నందమూరి తారక రామారావు.. ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయాలలో మకుటం లేని మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నందమూరి తారకరామారావు వేషం కట్టారంటే చాలు అది ఎలాంటి నాటకం అయినా లేదా సినిమా అయినా సరే విజయం సాధించాల్సిందే.. డైలాగ్ డెలివరీ,బాడీ లాంగ్వేజ్, డాన్స్ స్టెప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీరామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.

do-you-know-who-adopted-nt-rama-rao
do-you-know-who-adopted-nt-rama-rao

ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా,నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తూనే ఎన్నో సినిమాల్లో నటించడం గమనార్హం.జానపద,సాంఘిక, పౌరాణిక ఇలా అన్ని రకాల సినిమాల్లో నటిస్తూనే అన్ని వర్గాల ప్రజలను కూడా చాలా చక్కగా ఆకట్టుకున్నారు. సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈయన తన సేవల ద్వారా ప్రజలను కూడా మెప్పించారు.. ఇక ప్రేక్షకుల్లో సంపాదించుకున్న పేరును,రాజకీయాల్లో ఉపయోగించుకొని ఏకంగా మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల ద్వారా నేటికీ ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు.అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంత గొప్పవో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఇకపోతే నందమూరి తారక రామారావును దత్తత తీసుకున్నారు అనే ఒక విషయం ప్రస్తుత వైరల్ గా మారింది. నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణాజిల్లా,గుడివాడ తాలూకా,నిమ్మకూరు అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరి,తల్లి నందమూరి వెంకట రామమ్మ. అయితే నందమూరి తారకరామారావు మామయ్య,అత్తయ్య లకు పిల్లలు లేకపోవడం కారణంగా.. లక్ష్మయ్య చౌదరి వెంకట రామమ్మ దంపతులు..వెంకటరామమ్మ అన్నా,వదినలకు చిన్నతనంలోనే నందమూరి తారకరామారావును దత్తత ఇచ్చారు.ఇక అలా వారి సంరక్షణలోని నందమూరి తారకరామారావు ఎన్నటికీ దేశం గర్వించదగ్గ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Read Also : Sudigali sudheer: చిత్రతో కలిసి అందం హిందోళం పాటతో అదరగొట్టిన సుధీర్..!

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel