RGV Comments on mahesh babu: బాలీవుడ్ తనని భరించలేదా.. ఆసలు దీనికి అర్థమేమిటి అంటున్న ఆర్జీవి!

RGV Comments on mahesh babu: బాలీవుడ్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై వివాదం జురుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్పందించారు. మహేష్ చేసిన కామెంట్లకు అర్థం ఏమిటో తనకు తెలియదని ఆయన అన్నారు. బాలీవుడ్ తనని భరించలేదంటూ… మేజర్ సినిమా ట్రైలర్ ఈవెంట్ లో మహేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మహేశ్ కామెంట్లపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు అసహనంగా ఉన్నారని ఆంగ్ల పత్రికల్లోనూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్ వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ… బాలీవుడ్ అనేది ఒక సంస్థ కాదని.. ఎక్కడ సినిమాలు చేయాలి, ఎలాంటి కథలు ఎంచుకోవాలనేది ఒక నటుడి సొంత నిర్ణయం అని వివరించారు.

కాకపోతే… బాలీవుడ్ తనని భరించలేందటూ మహేశ్ చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఏమిటో తనకు తెలియట్లేదని రాంగోపాల్ వర్మ తెలిపారు. అయినా బాలీవుడ్ అనేది కేవలం ఒక కంపెనీ కాదని.. మీడియా వాళ్లే ఆ పేరును సృష్టించారని చెప్పారు. అలాగే నిర్మాత, ప్రొడక్షన్ కంపెనీ మాత్రమే తన చిత్రాల్లో నటించమని కోరుతూ… నటీనటులకు డబ్బులు ఇస్తుంటారని.. అలాంటప్పుడు బాలీవుడ్ మొత్తాన్ని జనరలైజ్ చేసి ఎలా చెబుతారో నాకు అర్థం కావట్లేదని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel