G
Telugu News » Entertainment » demon pawan rithu chowdary bangaram song telugu
Entertainment, Latest, Trending

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్, రీతూ చౌదరి జంటగాా ‘బంగారం’ ఆల్బమ్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Bangaram Song Demon Pawan Rithu Chowdary : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫేమ్ జోడీ డీమాన్ పవన్, రీతూ చౌదరి మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈసారి టీవీ షోలతో కాదు, ఓ మెలోడీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘బంగారం’ పేరుతో విడుదలైన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ క్యూట్ జోడీ బంగారం రొమాంటిక్ సాంగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రియాలిటీ షోలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అప్పట్లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ క్రేజ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అదే జోడీ మరోసారి తెరపై కనిపించడంతో అభిమానులు పాటను ఆసక్తిగా చూస్తున్నారు.

Advertisement

బిగ్ బాస్ జోడీకి మళ్లీ ఫుల్ రెస్పాన్స్ :

‘బంగారం’ ఆల్బమ్ సాంగ్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఫీల్‌గుడ్ రొమాంటిక్ మూడ్‌తో సాగుతుంది. ఇందులో డీమాన్ పవన్, రీతూ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇద్దరి మధ్య కనిపించే నేచరల్ కెమిస్ట్రీ, అందమైన విజువల్స్, మెలోడీ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Read Also : Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

ఈ పాటకు అఫ్రోజ్ అలీ లిరిక్స్ అందించారు. స్వరరచన చేసి ఆయనే స్వయంగా పాడారు. స్టార్ సింగర్ సమీరా భరద్వాజ్ వోకల్స్ కూడా పాటకు మరింత అందాన్ని తెచ్చాయి. సంగీత దర్శకుడు రంజిత్ రెడ్డి అందించిన మ్యూజిక్ పాటకు ప్రత్యేక బలంగా చెప్పొచ్చు. మెలోడీ, బీట్‌లు, మ్యూజిక్ అరేంజ్‌మెంట్ అందరితో సాయంతో ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతూ మ్యూజిక్ లవర్స్ టాప్ ప్లేలిస్ట్‌లలో నిలుస్తోంది.

Advertisement

టీమ్ రెస్పాన్స్.. ఫ్యూచర్ ప్లానింగ్ రెడీ :

ఈ పాటకు దర్శకత్వం, కొరియోగ్రఫీ చేసిన విజ్జు ముధిరాజ్ మాట్లాడుతూ.. డీమాన్ పవన్, రీతూ చౌదరి సహా మొత్తం టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు పాటను ఆదరిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఇదే ఆదరణతో ‘బంగారం’ మరింత భారీ విజయాన్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

డీమాన్ పవన్ మాట్లాడుతూ.. డీపీ క్రియేషన్స్ బ్యానర్‌ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆల్బమ్ సాంగ్‌ను లాంచ్ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇదే బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు, సినిమాలు, థియేటర్ మూవీలను నిర్మించాలనే ప్లాన్ కూడా ఉందని తెలిపారు.

ఈ పాట షూటింగ్ సమయంలో రీతూ చౌదరి చాలా కోఆపరేట్ చేశారని, ఇద్దరూ మంచి స్నేహితులుగా మారామని చెప్పారు. అలాగే ఈ పాటను నాగార్జున లాంచ్ చేసి అభినందించడం చాలా హ్యాపీగా అనిపించదన్నారు. ప్రోమోను ఉప్పలపాటి శ్యామలాదేవి విడుదల చేసి ప్రోత్సహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు.

‘బంగారం’ ఆల్బమ్ సాంగ్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ జోడీకి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉందని మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. మెలోడీ, విజువల్స్, నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ పాటను ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ పాటకు రాబోయే రోజుల్లో మరింత ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

🏷Bangaram SongDemon PawanRithu ChowdaryTelugu Romantic Song
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు