Monal Gajjar : యానీ మాస్టర్‌ బిగ్‌బాస్ లోకి వచ్చింది అందుకేనట.. మోనాల్ షాకింగ్ కామెంట్స్..!

Updated on: November 20, 2021

Monal Gajjar : బిగ్ బాస్ గత సీజన్‌లో తన అందంతో ఆడియన్స్ ను కట్టిపడేసిన మోనాల్ గజ్జర్.. ప్రస్తుతం యానీ మాస్టర్ విషయంలో స్పందించి పలు కామెంట్స్ చేసింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో యానీ మాస్టర్ సైతం హౌస్ కంటస్టెంట్.

అయితే కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఎలిమినేషన్ రౌండ్స్‌లో చాలా మంది ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే తాజాగా యానీ మాస్టర్ సైతం ఎలిమినేషన్ లోకి వచ్చేయడంతో ఇక ఆమె హౌస్ నుంచి బయటకు వెళ్లడం పక్కా అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ముందుగానే గుడ్ బై అంటూ చెబుతున్నారు.

ఈ విషయంపై ఇటీవలే స్పందించింది మోనాల్. సోషల్ మీడియాలో యానీ మాస్టర్ పట్ల నెటిజన్స్ వ్యవహరిస్తు్న్న తీరు తనకు నచ్చడం లేదని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా యానీ మాస్టర్ కు తన సపోర్ట్ అందించింది. యానీ మాస్టర్‌కు ఓటువేసి సేవ్ చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే యానీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తూ తన ఇన్ స్టా స్టోరీస్‌లో వీడియోస్ పోస్ట్ చేసింది. కొన్ని పోల్స్ అప్పుడే యానీ మాస్టర్‌కు గుడ్ బై చెబుతున్నాయని సీరియస్ అయింది.

Advertisement

యానీ మాస్టర్ తనకు వ్యక్తిగతంగా తెలుసని, తనకు ఓటు వేయాలని ఆడియన్స్‌ను కోరింది. తన జీవితంలో ఆమె ఒంటరిగానే ఎదిగిందని చెప్పుకొచ్చింది. సొంతంగా హౌస్ కొనాలనే ఆశతోనే యానీ మాస్టర్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిందని వివరించింది. అందుకే ఆమెకు సపోర్టుగా నిలివాలని, ఆమెను గెలిపించాలని వేడుకుంది మోనాల్. మరి మోనాల్ రిక్వెస్ట్‌ను నెటిజన్స్ ఎలా స్వీకరిస్తారో చూడాలి.

Read Also : Radhika Apte : బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే హాట్ కామెంట్స్.. అందుకోసం ఇండస్ట్రీకి రాలేదట..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel