Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Pllavi dey suicide: సీరియల్ నటి పల్లవి డే ఆత్మహత్య.. ఏమైందో తెలుసా?

Pllavi dey suicide: ప్రముఖ బెంగాలీ నటి, టీవీ యాక్టర్ పల్లవి డే అనుమానాస్పదంగా మృతి చెందింది. కోల్ కతా గార్పా ప్రాంతంలోని తన ఫ్లాట్ లో ఆదివారం శవమై కనిపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కోల్ కతాలోని ఎమ్ఆర్ బంగూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే పల్లవి ఆత్మహత్యకు కారణాలు ... Read more

By Vinod Kumar

Published on: May 17, 2022 11:19 AM

Updated on: May 17, 2022 11:19 AM

---Advertisement---

Pllavi dey suicide: ప్రముఖ బెంగాలీ నటి, టీవీ యాక్టర్ పల్లవి డే అనుమానాస్పదంగా మృతి చెందింది. కోల్ కతా గార్పా ప్రాంతంలోని తన ఫ్లాట్ లో ఆదివారం శవమై కనిపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కోల్ కతాలోని ఎమ్ఆర్ బంగూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

అయితే పల్లవి ఆత్మహత్యకు కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదు. అనంతరం ఆమె మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి పంపించారు. నటి పల్లవి మృతి పట్ల ఆమె సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఇంత చిన్న వయసులోనే చనిపోయిన సీరియల్ నటి పల్లవి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నారు. పల్లవి అభిమానులు ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.