Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Narayandas narang: ఏషియన్స్ థియేటర్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ మృతి

తెలుగు చలన చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు నారంగ్(78) కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే గత పది రోజుల నుంచి ఆరోగ్య

By Vinod Kumar

Published on: April 19, 2022 11:04 AM

Updated on: April 19, 2022 11:04 AM

---Advertisement---

తెలుగు చలన చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు నారంగ్(78) కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే గత పది రోజుల నుంచి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. నారాయణ్ దాస్ నారంగ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Asian thetres head and producer narayandas narang passed away

Advertisement

నారాయణ్ దాస్ నారంగ్ ఏసియన్ మల్టీ ప్లెక్స్, ఏసియన్ థియేటర్స్​కు అధినేత. అంతే కాకుండా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా సినీ పరిశ్రమకు నారంగ్ ఎన్నో సేవలు అందించారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌లో ‘లవ్ స్టోరీ’, ‘లక్ష్య’ సినిమాలు నిర్మించిన ఆయన ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, ధనుష్‌తో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా నారాయణ్ దాస్ నారంగ్ సినీ పరిశ్రమకు సేవలందించారు నారంగ్​.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.