Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Alia ranabir wedding: ఆలియా, రణబీర్ కపూర్ ల పెళ్లి వాయిదా.. ఎప్పుడో తెలుసా?

బాలీవుడ్​ టాప్ హీరోయిన్ ఆలియా భట్.. చాక్లెట్ బాయ్​ రణ్​బీర్​ కపూర్ ల పెళ్లి గురించి ఆసక్తి కరమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున

By Vinod Kumar

Published on: April 12, 2022 1:49 PM

Updated on: April 12, 2022 1:49 PM

---Advertisement---

బాలీవుడ్​ టాప్ హీరోయిన్ ఆలియా భట్.. చాక్లెట్ బాయ్​ రణ్​బీర్​ కపూర్ ల పెళ్లి గురించి ఆసక్తి కరమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న వీరి వివాహం ఈ నెల 14వ తేదీన జరగబోతున్నట్లు ప్రకటించారు. అదుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పెళ్లి కావాల్సిన బట్టలు సహా అన్ని ఫంక్షన్ల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లుండే పెళ్లనగా.. ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. శనివారం జరగబోయే పెళ్లి మరోసారి వాయిదా పడిందని తెలిసింది. ఈ విషయాన్ని ఆలియా హాఫ్​ బ్రదర్ రాహుల్​ చెప్పారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆలియా, రణ్​బీర్​ కపూర్ ల వివాహ విషయంపై స్పందించారు. అయితే ఏప్రిల్ 14న వీరి వివాహం చేసుకోవాలని అనుకోగా.. అనుకోని పరిస్థితుల కారణంగా మార్చా్సి వచ్చిందని తెలిపారు. అయితే ఎంత గోప్యత పాటించినప్పటికీ ఈ విషయం బయటకు వచ్చిందన్నారు. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మెహందీ, హల్దీ సహా అన్ని వేడుకల తేదీల్లో మార్పులు చేశారు. అలా పెళ్లి తేదీని కూడా మార్చారు. ఏప్రిల్​ 20న వీరి వివాహం జరగవచ్చు” అని అన్నారు.

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.