Surekhavani comments: పవర్ స్టార్ పై సురేఖా వాణి బోల్డ్ కామెంట్లు.. ఏమంటుందంటే?

Surekhavani comments: అక్కగా, చెల్లిగా, వదినగా, పిన్నిగా, అత్తగా చాలా క్యారెక్టర్ లు చేసి తెలుగు ప్రేక్షకల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్నా.. ఇద్దరూ ఒకేలా కనిపిస్తూ ఎప్పుడూ వివాదాల్లో చిక్కకుంటారు. సెలవు దొరకిందంటే చాలు పార్టీలు, పబ్బులు, ట్రిప్పులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే తాజాగా సురేఖా వాణి బోల్డ్ కామెంట్లు చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు పిచ్చి అని.. డేట్ చేయాల్సి వస్తే అతనితోనే చేస్తానని వివరించింది. అంతే కాదండోయ్ ఆ హీరోకు వంద ముద్దులు ఇస్తానంటూ తెలిపిందీ సీనియర్ హాట్ బ్యూటీ. అలాగే తన పెళ్లి ప్రస్తావన తీసుకు రాగా.. ఇప్పుడు తనకా ఆలోచన లేదని తెలిపింది. చేసుకోవాల్సి వస్తే భర్తకంటే కూడా బాయ్ ఫ్రెండ్ అవసరమే ఎక్కువగా ఉందని వివరించింది.

Advertisement

అంతే కాదండోయ్ తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ కు ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని ఓ లిస్టు కూడా బయట పెట్టింది. అలాగే కండీషన్లను కూడా తెలిపింది. లైట్ గా గడ్డం ఉండాలని, బాడీ చాలా ఫిట్ గా ఉండాలని, రొమాంటిక్ గా కనిపించాలని.. అలాగే బాబా డబ్బులుండాలని తెలిపింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ.. పెళ్లీడుకొచ్చిన కూతురును పెట్టుకొని నీ కోరికలేంటంటూ కామెంట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel