Aa Ammayi Gurinchi Meeku Cheppali : `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఫస్ట్ లుక్ విడుదల

Updated on: August 4, 2025

Aa Ammayi Gurinchi Meeku Cheppali : హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో మరో కొత్త చిత్రం రాబోతోంది. అదే.. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయింది. చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా హీరోయిన్‌ కృతి శెట్టి నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు ఈ మూవిని సమర్పిస్తోంది. బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మూవీ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా

నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ… ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని అన్నారు. కృతిశెట్టి మాతో సెకండ్ మూవీ చేస్తోందన్నారు. అమ్మాయి గురించి చెప్పడమే కాదు చాలా అందంగా చూపించారని చెప్పారు. ఇదో రొమాంటిక్ డ్రామా. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. కృతిశెట్టిని ఉప్పెనలో చూసినప్పుడు ఇంప్రెసివ్‌గా అనిపించింది. శ్యామ్ సింగరాయ్‌లోనూ ఆకట్టుకుందన్నారు.

Aa Ammayi gurinchi meeku cheppali First Look Release : 

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ… ఇంద్రగంటితో నాకిది మూడో సినిమా. నేను హీరోయిన్‌తో కూడా మూడు చిత్రాలు చేయలేదు. ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రానికి మీరు ఎక్కడా వంక పెట్టలేరు. అంత పర్ ఫెక్ట్ గా ఉంటుంది. సమ్మోహనంలో సినిమాలంటే ఇష్టంలేని క్యారెక్టర్ చేశాను. ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రంలో సినిమా డైరెక్టర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్ ఉంటుంది. కృతి గురించి చెప్పాలంటే కోరినట్లు నటించగల హీరోయిన్. గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగలదన్నారు.

Advertisement

Advertisement

హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ… ఆ అమ్మాయి గురించి చెప్పాలి.. ఈ సినిమా మొదలైన కొద్ది రోజులకే నాకు గొప్ప అనుభవం ఇచ్చే సినిమా అవుతుందని అర్థమైంది. కథలోనే మా పాత్రలన్నీబాగున్నాయి. కొందరికి రొమాంటిక్ పార్ట్, మరికొందరికి ఫ్యామిలీ పార్ట్ నచ్చుతాయి. సినిమా అంతా మన ఇరుగు పొరుగు ఇంట్లో జరిగినంత సహజంగా ఉంటుంది. సుధీర్ బాబు అంత కోపరేట్ చేసే హీరోను చూడలేదు. మన క్యారెక్టర్ మనం చేసేందుకే కష్టపడాలి. అలాంటిది మాకు సపోర్ట్ చేస్తుంటారని తెలిపింది.

Read Also : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్… ఆ స్థానం నాకు వద్దు..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel