AAI Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కనే యువతకు ఇదో సువర్ణావకాశం. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లో సీనియర్ కన్సల్టెంట్ పోస్టుకు ఖాళీ ఉంది. ప్లానింగ్ అండ్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ కోసం ఈ నియామకం జరుగనుంది. ఆగస్టు 1, 2025 చివరి తేదీ.
ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థికి రూ. 1.5 లక్షల వరకు జీతం లభిస్తుంది. ఈ నియామకం ఒక ఏడాది కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటుంది. దీని కింద, మొత్తం 10 పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో 6 సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు, ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో 4 పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వేర్వేరు పోస్టులకు దరఖాస్తులను విడిగా ఇవ్వాల్సి ఉంటుంది.
Read Also : New UPI Rules : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త UPI రూల్స్.. ఇకపై అలా చేయలేరు!
వయస్సు, విద్య :
సీనియర్ కన్సల్టెంట్ ప్లానింగ్ :
- అభ్యర్థి గరిష్ట వయస్సు 2025 ఆగస్టు 1 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
- సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, MBA (ఏదైనా స్పెషలైజేషన్).
- IIT లేదా NIT నుంచి డిగ్రీ పట్టా అభ్యర్థులకు ప్రాధాన్యత.
- మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ, అమలు, MIS అభివృద్ధిలో 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల అనుభవం ఉండాలి.
AAI Recruitment 2025 : సీనియర్ కన్సల్టెంట్ ఆపరేషన్స్ :
అభ్యర్థి ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ లేదా ఆపరేషన్స్ రీసెర్చ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే MBA (ఏదైనా స్పెషలైజేషన్‌లో) కలిగి ఉండాలి. డేటా విశ్లేషణ, రిపోర్టులు లేదా అధికారిక ప్రతిస్పందనల తయారీలో 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా :
అర్హత గల అభ్యర్థులు జూలై 21 నుంచి ఆగస్టు 1 మధ్య aai.aero లేదా edcilindia.co.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వేర్వేరు దరఖాస్తులను సమర్పించాలి.
AAI Recruitment 2025 : ఎంపిక ప్రక్రియ :
విద్యార్హత, అవసరమైన అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను మాత్రమే ఇమెయిల్ ద్వారా సంప్రదిస్తారు.
ముఖ్య గమనిక.. అర్హతలు, నిబంధనలివే :
- నియామకం ఒక ఏడాది తర్వాత కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది.
- భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తుదారులు అన్ని అర్హతలు, అనుభవాన్ని ఆగస్టు 1, 2025న లేదా అంతకు ముందు పొంది ఉండాలి.
- ఇంటర్వ్యూకు హాజరైనందుకు ఎలాంటి TA/DA చెల్లించబడదు.
- పూర్తి చేసిన సర్వీసు ఆధారంగా నెలకు 1.5 రోజుల సెలవు ఉంటుంది.
- ఎలాంటి అదనపు మొత్తం లేదా నగదు చెల్లింపు ఉండదు.