Vinayaka Vahanam : గణపతి ఎలుక ఎందుకు వాహనంగా చేసుకున్నాడో తెలుసా..!

Updated on: December 26, 2022

Vinayaka Vahanam : వినాయకచవితి వస్తుందనే ఊరూరా మండాపాలు కొలువుదీరుతాయి. గల్లీలు అన్ని సుందరంగా ముస్తాబవుతాయి. మైక్ సెట్లు, డప్పు సప్పుళ్ల మధ్య ఆదిదేవుడు నవరాత్రుల కోసం మండపాల్లో కొలువుదీరుతాడు. పిండి వంటలతో పాటు విశిష్టమైన పూజలు అందుకుంటారు.

కులమతాలకతీతంగా గణేశ్ నవరాత్రులు ఎంతో శోభాయమానంగా ప్రతీయేడు జరుగుతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా భారీ ఆకృతిలో ఉండే బొజ్జగణపతి చిట్టి ఎలుకను ఎందుకు వాహనంగా చేసుకున్నాడో ఎవరికీ తెలీదు. మీలో ఎవరికైనా ఈ విషయం తెలుసుకోవాలని ఉంటే మరి ఎందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి..

Vinayaka Vahanam : Reason Behind Lord Ganesh Selecting Mouse As Vahanam
Vinayaka Vahanam : Reason Behind Lord Ganesh Selecting Mouse As Vahanam

గత జన్మలో ఒక యోగి ద్వారా శాపం పొందిన దైవాంశసంభూతుడే ఈ మూషికం. అయితే, ఆ మూషికుడు గణపతికి ఎలా వాహనంలా మారాడనే విషయం గణేశ్ పురాణంలో ఈ విధంగా ఉంది. క్రోంచ కథ.. ఓ రోజు ఇంద్రుడి సభలో క్రోంచ అనే దైవాంససంభూతుడు అనుకోకుండా ఓ ముని కాలు తొక్కుతాడు.

Advertisement

దీంతో ఆగ్రహించిన ముని వెంటనే ఎలుకగా మారాలని క్రోంచను శపిస్తాడు. తనకు అలాంటి శిక్ష విధించవద్దని కాళ్ల మీద పడటంతో తన శాపం వెనక్కి రాలేదని.. కానీ క్రోంచ ఆదిదేవుడైన గణేశుడి వాహనంలా మారి భవిష్యత్  లో దేవతలతో సమానంగా పూజలు అందుకుంటాడని చెబుతాడు. క్రోంచుడు వామదేవ ముని శాపం వలన ఎలుకగా మారి పరాశర ఆశ్రమంలో పడుతాడు.

Vinayaka Vahanam : భయపెట్టేంత ఆకారం..

క్రోంచ అనేది సాధారణ ఎలుక కాదు.. దాని ఆకారం ఓ పర్వతమంత ఉంటుంది. దీనిని చూసి ప్రజలు భయంతో పరుగులు తీసేవారు. పలుమార్లు వినాశానికి కారణం అవుతాడు. ఆ సమయంలో గణపతి పరాశరుడి ఆశ్రమానికి విచ్చేస్తాడు. ఈ సమయంలో ముని పరాశరుడు, అతని భార్య వత్సల ఆదిదేవుడికి సపర్యలు చేస్తారు.

అదే సమయంలో క్రోంచ విధ్వంసాలకు పాల్పడుతాడు. అది చూసిన గణపతి అతన్ని అదుపు చేయడానికి తన ఆయుధాలలో ఒకటైన పాషా(ఉచ్చు)ను క్రోంచ మీదకు విసురుతాడు. అది ఎలుక మెడకు బిగుసుకుంటుంది. ఆ తర్వాత గణపతి కాళ్లదగ్గరకు వచ్చి పడుతుంది. చివరకు క్రోంచ గణేశుడిని శరణు కోరడంతో  ముని శాపం ప్రకారం ఆదిదేవుడు అతన్ని మన్నించి వాహనంలా మారాలని చెబుతాడు.

Advertisement

Read Also : Vinayaka Chavithi 2022: వినాయక చవితి పూజా విధానం.. ఈ తప్పులు అస్సలే చేయకడూదు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel