Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు లక్ష్మీదేవి కృప..!

Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 21వ తేదీ నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా లక్కే లక్కు అని తెలిపారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లు తలపెట్టిన కార్యాలు పూర్తి అవుతాయి. సంతోషకరమైన కాలం ఉంది. వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. అంటే బంధువులు, స్నేహితులు మీకు బహుమతులు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. విందు, వినోద సుఖాలు కలుగుతాయి. ఈరోజంతా మీరు మంచి భోజనాన్ని తిని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

Advertisement

మకర రాశి.. మకర రాశి వాళ్లు మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఎలాంటి పని ప్రారంభించినా కచ్చితంగా విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు మంచి కాలం. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel