Solar Eclipse April 2022 : సూర్య గ్రహణం సమయంలో తులసి ప్రాధాన్యత ఏంటో తెలుసా?

Updated on: August 4, 2025

Solar Eclipse April 2022: హిందూ పురాణాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలను ప్రజలు చాలా చెడ్డవిగా భావిస్తారు. మన క్యాలండర్ ప్రకారం నాలుగు గ్రహణాలు వస్తాయి. రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు వస్తాయి. ఈ క్రమంలో 2022 వ సంవత్సరంలో ఆఖరిలో తొలి సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 12:15 గంటలకి సూర్యగ్రహణం మొదలయి మే ఒకటవ తేదీ తెల్లవారుజామున 4:07 గంటలకు ముగుస్తుంది. సూర్య గ్రహణం సమయంలో చాలామంది ఎటువంటి శుభకార్యాలు చేయటానికి కూడా ఆసక్తి చూపరు. ఎందుకంటే సూర్యగ్రహానికి చాలా అశుభమైనదిగా భావిస్తారు.

సూర్య గ్రహణం సమయంలో ఇంట్లో నుండి ఎవరు బయటకు కూడా రారు. సూర్య గ్రహణం సమయంలో అన్ని దేవాలయాలకి తలుపులు వేస్తారు. అయితే ఈ సంవత్సరం మన దేశంలో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. సూర్య గ్రహణం సమయంలో అందరూ ఎటువంటి ఆహారాన్ని తీసుకోరు. సూర్య గ్రహణం సమయంలో సూర్య కిరణాలు చాలా విషపూరితంగా ఉంటాయి. ఆ కిరణాలు తాకటం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది.

Advertisement

అందువల్ల వల్ల సూర్య గ్రహణం సమయంలో ముఖ్యంగా గర్భవతులు సూర్య కిరణాలు పడని ప్రదేశంలో ఉండమని మన పూర్వీకులు చెబుతుంటారు. సూర్య గ్రహణం సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోకూడదని వారు తెలియచేశారు. కానీ మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం సమయంలో తులసి ఆకుల తో కలిసి ఆహారం తీసుకోవటం వల్ల ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు అని నిపుణులు వెల్లడించారు. హిందూ పురాణాలలో తులసి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.

సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు నుండి వెలువడే కిరణాలు విషపూరితంగా ఉంటాయి. అందువల్ల అవి వాతావరణం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. సూర్య గ్రహణం సమయంలో మనం తీసుకొనే ఆహారాల మీద సూర్యకిరణాలు పడటం వల్ల ఆహారం విషపూరితంగా మారుతుంది. అందువల్ల ఆహారంలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులను కలపటం వల్ల ఆ ఆకులలో ఉండే పాదరసం సూర్యకిరణాలలో ఉండే విషాన్ని నిరోధిస్తాయి. సూర్య గ్రహణం సమయంలో ఆహారంతోపాటు తులసి ఆకులు తీసుకోవటం వల్ల ఎటువంటి గ్రహ దోషాలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel