Devotional Tips : పూజ గదిలో పూజకు ఎలాంటి విగ్రహాలను ఉపయోగించాలో తెలుసా?

Devotional Tips : సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన ఇంటిలో పూజలు చేయడం సర్వసాధారణం. అయితే ఈ విధంగా ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం కోసం ఎన్నో రకాల విగ్రహాలను ఉపయోగిస్తూ ఉంటారు.అయితే మార్కెట్లో మనకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే విగ్రహాలను తీసుకొని పూజ గదిలో పూజ చేయడం చూస్తుంటాము. నిజానికి పూజకు ఏవిపడితే అలాంటి విగ్రహాలు ఉపయోగించకూడదు కేవలం కొన్ని విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. మరి పూజకు ఎలాంటి విగ్రహాలను ఉపయోగించాలి అనే విషయానికి వస్తే…

do-you-know-what-kind-of-idols-to-use-for-worship-in-the-houses-in-telugu
do-you-know-what-kind-of-idols-to-use-for-worship-in-the-houses-in-telugu

సాధారణంగా చాలామంది ఇంట్లో పూజ చేయడం కోసం చాలా ఎత్తయిన పెద్ద పెద్ద విగ్రహాలను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి పెద్ద విగ్రహాలను పూజకు అస్సలు ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించినా ప్రతిరోజు అభిషేకాలు, నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది కనుక ఇలాంటి విగ్రహాలను ఉపయోగించకపోవడం మంచిది. ఇకపోతే ఇంట్లో రాగితో తయారుచేసిన వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే ఉపయోగించాలి. అలాగే స్పటికంతో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ఎంతో మంచిది. అయితే ఈ విగ్రహాలు పగలకుండా జాగ్రత్తపడాలి.

ఇక చాలామంది వెండి, బంగారంతో కూడా విగ్రహాలను తయారు చేయించి పూజిస్తారు. అయితే ఇలా వెండి బంగారంతో తయారు చేయించిన విగ్రహాలు కూడా చిన్నవిగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఇంట్లో నిత్య దీపారాధన కోసం ఉపయోగించే విగ్రహాలు ఎల్లప్పుడూ కూడా అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నటువంటి విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలి కానీ భయంకరమైన ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలను పూజలో ఉపయోగించకూడదు.

Advertisement

Read Also : Lord Ganapathi: వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel