Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Palmistry : అరచేతిలో ఈ గీత ఉంటే విదేశాలకు వెళ్తారు.. ఉందో లేదో చూసుకోండి

Palmistry : హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరి అరచేతి గీత అయితే, ఈ విధంగా బుధ పర్వతం నుండి ఉంగరపు వేలు దిగువకు వెళుతుందో అలాంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మూన్ లైన్ మౌంటైన్ కు వెళ్లినప్పటికీ అలాంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశం మాత్రం పొందుతారని శాస్త్రం చెబుతోంది.

అరచేతి రేఖ అంగారకుడి పైకి వెళ్లినా.. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం విదేశాలకు వెళ్లే అవకాశం మెండుగా ఉంటుంది. అదే విధంగా చంద్ర పర్వతంపై స్వస్తిక్ గుర్తు ఉంటే ఆ వ్యక్తి విదేశాలకు వెళ్లే యోగం తప్పక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Read Also :  Best stones for zodaic signs: ఏ రాశుల వారికి ఏ స్టోన్స్.. వాటిని ధరిస్తే లక్కే లక్కు!

Advertisement

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం అర చేతి రేఖ చంద్రుడి నుండి శని పైకి వెళ్తే, అటువంటి రేఖ కలిగిన వ్యక్తులు విదేశాలకు వెళ్లడమే కాకుండా విదేశాల నుండి తగినంత డబ్బు సంపాదించి తీసుకువస్తారు. లైఫ్ లైన్ నుండి చంద్ర పర్వతానికి ఒక రేఖ వెళ్తే, అలాంటి వ్యక్తి కూడా విదేశాలకు వెళ్తాడు.

Palmistry

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం కొంత మంది చేతుల్లో ప్రయాణ రేఖ చాలా లోతుగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు తన స్వస్థలం కాకుడా, మరొక దేశంలో నివసించవచ్చు. వారికి వీదేశీయోగం ఉండటమే కాకుండా.. అక్కడ శాశ్వతంగా సెటిల్ అయ్యే యోగం కూడా ఉంటుంది. అర చేతిలోని జీవిత రేఖ నుండి ఏదైనా రేఖ అదృష్ట రేఖను దాటితే ఆ వ్యక్తి విదేశాలకు ప్రయాణిస్తాడు.

Read Also : Hanuman stotram: కష్టాలతో సతమతం అవుతున్నారా.. హనుమాన్ లాంగూల స్తోత్రమ్ పటించండి

Advertisement
Exit mobile version