Hanuman stotram: కష్టాలతో సతమతం అవుతున్నారా.. హనుమాన్ లాంగూల స్తోత్రమ్ పటించండి

ఈ హనుమాన్ స్తోత్రం అతి శక్తివంతమైనది. దీనిని పటిస్తే ఎంతటి కష్టమైన తొలగి పోతుంది. జీవితాన్ని సతమతం చేసే కష్టాల నుండి గట్టెక్కాలంటే ఈ ఒక్క స్తోత్రం చాలు. లాంగూలం అంటే తోక అని అర్థం. ఆంజనేయుడి లాంగూలాన్ని పూజించడం కూడా అనేక సత్ఫలితాలను ఇస్తుంది. ఆంజనేయ స్వామి తన తోకతో లంకా దహనం చేసిన విషయం తెలిసిందే. ఎందరో రాక్షసులను అంతమొందించారు. అటు వంటి హనుమాన్ తోకను పూజించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

రోజూ హనుమాన్ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి శక్తి మేరకు పండో, ఫలాన్నో నివేదన సమర్పించి సింధూరంతో తోకపైన ఒక బొట్టు పెట్టాలి. ఈ విధంగా 41 రోజుల పాటు పూజ చేయడం వల్ల ఎటు వంటి పనైనా విజయవంతంగా పూర్తి అవుతుంది. కష్టాలు తీరిపోతాయి. అంతే కాకుండా లాంగూల స్తోత్రం కూడా ఎంతో మహిమాన్వితమైంది. ఆ స్తోత్రాన్ని నిత్యం పటించడం వల్ల అన్నింటా విజయం లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని రావి చెట్టు కింద కూర్చుని చదవడం మరింత ఫలితాన్ని కలిగిస్తుంది.

Hanuman

హనుమ లాంగూల స్తోత్రం
శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం |
చాల్ప ద్వాలధిబద్ధ వైరినిచయం చామీకరాది ప్రభం |
రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భూభంగ మంగస్ఫుర |
త్రోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం||
కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా ||
ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం|
ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే|
సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్రార్ధితమ్||
హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥
మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥
వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
రక్షోరాజప్రతాపాగ్ని దహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దర్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
సీతావిరహవారాశిభగ్న సీతేశతారక
స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ ||
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥
వజ్రాంగనఖదంష్టేశ వజ్రవజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర ||
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్షకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
ద్రోణాచలసముత్తేపసముల్జిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ ||
శ్రీరామ జయరామ జయ జయరామ

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel