love failure suicide : ప్రేమ.. సఫలం అయితే ఆనందంతో ఉబ్బితబ్బిప్పవ్వడం.. అదే విఫలమైతే ప్రాణాలు విడవడం. మనం ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో చూస్తున్నాం. అలాగే ప్రేయసి కాదందని.. అమేను చంపడం, దాడి చేయడం.. ఆపై వారూ ఆత్మహత్య చేసుకోవడం కూడా చాలానే వింటున్నాం. ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో చోటు చేసుకుంది.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువకుడు… గుంజపడుగుకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆమెతో ప్రేమ విఫలం అయిందని తీవ్ర సనస్తాపం చెందాడు. గుండె పగిలేలా ఏడుస్తూ… ప్రేయసి ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే వారి ఇంటి ముందు నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన యువతి కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆపై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా… మార్గ మధ్యంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు అసలు అతడి ప్రేమ గురించే తెలియదని బావురుమంటున్నారు.















