22 yeas house arrest: ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్లు.. గదిలో బందీ అయిన మహిళ!

ఓ మహిలన గత 22 ఏళ్లుగా ఇంట్లోనే బంధించారు కుటుంబ సభ్యులు. ఈ అమానవీయ ఘటన గుజరాత్​లోని సూరత్​లో జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న గంగాబా చారిటబుల్​ ట్రస్ట్​ అనే ఓ ఎన్​జీఓ ఆమెను విడుదల చేయించింది. సూరత్​లోని ఉదానాకు చెందిన బాధితురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా గదిలో బంధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె గతంలో తమను చాలా ఘోరంగా హింసించిందని వారి పిల్లలు చెబుతున్నారు. అప్పుడు మమ్మల్ని ఎవరూ కాపాడలేదని పేర్కొంది.

ఒక వేళ మీరు ఆమెను బలవంతంగా విడిపించి తీసుకెళ్తే.. మిమ్మల్ని కూడా చాలా హింసింస్తుందని వివరించారు. చివరకు పోలీసులు సాయంతో ఆమెకు బందీ నుంచి విముక్తి కలిగించామని ఎన్​జీఓ సభ్యులు జాల్పాబెన్ సొనానీ తెలిపారు. ఆమెను మానసిక వైద్య శాలలో చేర్పిస్తే.. భాగయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు వైద్యులకు చూపించాల్సిందానికి బదులుగా ఇంట్లోనే ఉంచి బంధించడం సరికాదని స్పష్టం చేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel