Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Sister Death : చనిపోయిన చెల్లితో అక్క నాలుగురోజుల సహజీవనం.. అసలేం జరిగింది..?

Sister Death : వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకరు శ్వేత, మరొకరు స్వాతి. గతంలోనే తల్లితోపాటు నాయనమ్మ కూడా మృతిచెందారు. వీరిద్దరిని వదిలి తండ్రి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొద్దిరోజులుగా శ్వేత కనిపించట్లేదు. ఇదే విషయాన్ని స్థానికులు స్వాతిని ఆరా తీస్తే సమాధానం చెప్పలేదు.సోమవారం సాయంత్రం వీరి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా శ్వేత శవమై కుళ్లిపోయినస్థితిలో ఉండగా.. అక్క స్వాతి ఆ శవం వద్దే కూర్చుని ఉంది. ... Read more

By Ramesh Babu

Published on: January 18, 2022 11:28 AM

Updated on: January 23, 2022 10:27 PM

elder sister dead body

---Advertisement---

Sister Death : వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకరు శ్వేత, మరొకరు స్వాతి. గతంలోనే తల్లితోపాటు నాయనమ్మ కూడా మృతిచెందారు. వీరిద్దరిని వదిలి తండ్రి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొద్దిరోజులుగా శ్వేత కనిపించట్లేదు. ఇదే విషయాన్ని స్థానికులు స్వాతిని ఆరా తీస్తే సమాధానం చెప్పలేదు.సోమవారం సాయంత్రం వీరి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

వారు వచ్చి పరిశీలించగా శ్వేత శవమై కుళ్లిపోయినస్థితిలో ఉండగా.. అక్క స్వాతి ఆ శవం వద్దే కూర్చుని ఉంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది.జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్వాతి, శ్వేత. 2016లో వీరి తల్లితో పాటు నాయనమ్మ చనిపోయారు. తల్లి చనిపోయినప్పుడు పిల్లలు సుమారు రెండురోజుల పాటు శవంతోనే ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.

ఆమె శవాన్ని ఇంట్లోనే ఖననం చేసినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో తండ్రి వీరిని వదిలి వెళ్లిపోయాడు. ప్రగతినగర్‌ పెద్దపల్లికి శివారులో ఉండడంతో వీరు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారుకాదు. పైగా ఇద్దరికీ మానసిక పరిస్థితి సరిగా ఉండేదికాదు. రేషన్‌ బియ్యం తెచ్చుకుని తింటూ ఇంట్లోనే ఉండేవారు.

శ్వేత కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో స్థానికులు స్వాతిని ఆరా తీశారు. అయినా ఆమె బదులు చెప్పలేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా శ్వేత (24) శవం కుళ్లిపోయి ఉంది. ఆమె 4 రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అంత దుర్వాసనలోనూ స్వాతి ఎలా ఉందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఎస్సైలు రాజేశ్, రాజవర్ధన్‌ ఆధ్వర్యంలో శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. స్వాతి వద్ద డబ్బులు లేకపోవడంతో పోలీసులే దహన సంస్కారాలు పూర్తిచేయించారు. స్వాతి మానసిక స్థితి సరిగా లేదని ఎస్సై తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Sisters Death : Whatsapp New Features : త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్… ఇక ఆ దిగులు ఉండదు !

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!