Crime News : మద్యం తాగొద్దన్నందుకు భార్య, సోదరిని హత్య చేసిన కిరాతకుడు… ఎక్కడంటే ?

Crime News : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఇది ఎప్పటినుంచో నిపుణులు చెబుతున్న మాట. మద్యం కారణంగా ఎన్నోరకాల ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా మద్యం సేవించడం వల్ల కేన్సర్ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గతేడాది 7,41,300 మంది. అలానే మద్యం మత్తులో ఎన్నో దారుణాలు జరిగిన ఘటనలు అందరికీ తెలిసిందే. కాగా తాజాగా శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో ఓ వ్యక్తి ఇద్దరిని చంపి ఆపై తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

మద్యం తాగొద్దన్నందుకు తన భార్యతో పాటు అడ్డుగా వచ్చిన సోదరిని కూడా హతమార్చాడు కిరాతకుడు. ఈఘటనలో తండ్రితో పాటు సోదరి కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

man-killed-wife-and-sister-for-they-said-dont-drink-alchohol

Advertisement

వివరాల్లోకి వెళ్తే… ముద్దాడపేటలో నివాసముండే వి.సి అప్పన్న మద్యానికి బానిసైయ్యాడు. దీంతో ప్రతిరోజు కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్య అప్పమ్మపై దాడికి తెగబడ్డాడు. అడ్డుగా వచ్చిన తన సోదరి రాజులను హత్య చేశాడు. భార్యను చంపుతుండగా అడ్జొచ్చిన తన తండ్రితో పాటు సోదరి కుమార్తె పద్మను కూడా అప్పన్న గాయపరిచాడు. ఈ ఘటనలో గాయపడిన వారితో పాటు అప్పన్న శ్రీకాకుళం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అప్పన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, ఈ హత్యలకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read Also : Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్‌ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel