Karate kalyani: యూట్యూబర్ ను గుడ్డలూడదీసి కొట్టిన కరాటే కళ్యాణి… వామ్మో!

Karate kalyani: నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లోకెక్కింది. బిగ్ బాస్ తర్వాత జీజేపీలో చేరిన ఈమె.. హిందుమత పరిరక్షణ పేరుతో వరుస వివాదాల్లో ఉంటూ వస్తోంది. అయితే తాజాగా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని గుడ్డలు ఊడదీసి మరీ కొట్టి అతని చేతిలో దెబ్బలు కూడా తింది. అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడిలో తెగ వైరల్ అవుతోంది.

మహిళల్ని అగౌరవ పరుస్తూ… ప్రాంక్ వీడియోలతో పాటు, పలు అసభ్యకర వీడియోలను తీస్తూ.. యూట్యూబ్ లో పెడ్తుంటాడు శ్రీకాంత్ రెడ్డి. అయితే ఇతను కరాటే కళ్యాణి వాళ్ల ఇంటి దగ్గరే ఉంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె.. శ్రీకాంత్ రెడ్డిని నిలదీసింది. సమాజాన్ని నాశనం చేస్తున్నావంటూ గూబ గుయ్యుమనిపించింది. వెంటనే అతను కరాటే కళ్యాణిని కింద పడేసి కొట్టాడు. వెంటనే ఆమె పక్కన ఉన్న ఓ వ్యక్తి శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేయగా… స్థానికులంతా వచ్చారు. అందరూ కలిసి శ్రీకాంత్ రెడ్డిని ఓ ఆట ఆడుకున్నారు. తీవ్ర కోపోద్రిక్తురాలైన కళ్యాణి… శ్రీకాంత్ రెడ్డి గుడ్డలు ఊడదీసి మరీ కొట్టింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel