Crime News: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ అరెస్ట్..!

Updated on: March 22, 2022

Crime News: నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటాడు. బాలకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం హిందూపురంలో బాలకృష్ణ పిఎ బాలాజీని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది.పేకాట స్థావరాలుగా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేయగా వారిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఉండటంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..

ఆంధ్రా కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని నగరిగేర వద్ద పేకాట పావురాల పై కర్ణాటక టాస్క్ఫోర్స్ పోలీసులు పోలీసులు దాడులు చేయగా పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు సహా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్సనల్ అసిస్టెంట్ నీ కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల దాడిలో దాదాపు 19 మంది పట్టుబడ్డారు.వారి నుండి లక్షా యాభై వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పేకాట లో పట్టుబడిన వారిని అరెస్టు చేసిన పోలీసులు కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరు పరిచినట్లు సమాచారం.

ప్రత్యర్థి పార్టీ నాయకులతో కలిసి బాలకృష్ణ పిఏ ఇలా పేకాట ఆడుతూ పట్టుబడటం హిందూపురంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం గురించి బాలకృష్ణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న సంగతి ఆసక్తికరంగా మారింది. హిందూపురంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటినుంచి బాలాజీ వ్యవహరిస్తూ నియోజకవర్గంలోని రాజకీయ వ్యవహారాలను బాలాజీ దగ్గరుండి చూసుకునేవాడు. బాలకృష్ణ ప్రియ మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో బాలకృష్ణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel