Cyber Crime : కంపెనీ మెయిల్ హ్యాక్ చేసి రూ. 46 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు… ఏం జరిగిందంటే !

Updated on: January 25, 2022

Cyber Crime : ఆన్‌లైన్ లావాదేవీల పెరుగుదలతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మీ KYC వివరాలను అప్‌డేట్ చేస్తున్నట్లు నటిస్తూ ఫోన్ చేయడం, మీకు ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేర్వేరు మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన వరప్రసాద్ కంపెనీ ఈ-మెయిల్ ను హ్యాక్ చేశారు సైబర్ దొంగలు. మొత్తం రూ.46 లక్షలు కాజేశారు.

వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కి చెందిన వరప్రసాద్ సెన్సార్ కేర్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మెడికల్ పరికరాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. విదేశాల నుంచి వాటిని కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు.

Advertisement

ఇందుకోసం అమెరికాలోని క్యాలిఫోర్నియా లో ఉన్న ఏజీ సైంటిఫిక్ అనే కంపెనీకి ఆర్డర్లు ఇస్తుంటాడు. ఇందుకోసం తన పర్సనల్ ఈ-మెయిల్ తో తరచూ లావాదేవీలు నిర్వహిస్తుంటాడు. తాజాగా ఆ కంపెనీకి చెందిన మెయిల్ ను హ్యాక్ చేశారు సైబర్ మాయగాళ్లు. అమెరికా కంపెనీ లాగా మెయిల్ చేసి కొత్త అకౌంట్ లోకి డబ్బులు వేయించుకున్నారు.

ఇందులో భాగంగా 63 వేల డాలర్లను (ఇండియన్ కరెన్సీలో రూ. 46 లక్షలు) సైబర్ దొంగల ఖాతాల్లోకి డిపాజిట్ చేశాడు వరప్రసాద్. అయితే తాను లావాదేవీలు నిర్వహిస్తోన్న కంపెనీకి డబ్బులు అందలేదని తెలియడంతో తాను మోసపోయానన్న విషయం తెలుసుకున్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లావాదేవీలతో జాగ్రతగా ఉండడం మంచిది.

Advertisement

Read Also : Crime News : అర్ధరాత్రి ఎక్సర్ సైజ్ చేయొద్దన్నందుకు… కన్న తల్లిని కడతేర్చిన కొడుకు !

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel