Bear Attack : యువకుడిపై ఎలుగుబంటి భయంకరమైన దాడి.. 300 కుట్లేసిన వైద్యులు..

Updated on: January 7, 2022

Bear Attack : ఎలుగుబంటి చేసిన దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సదరు యువకుడు గుర్తు పట్టలేనంత రీతిలో తయారయ్యాడు. ఇంతకీ ఈ దాడి ఎక్కడ జరిగిందంటే.. గుజరాత్ స్టేట్..ఛోటా ఉదేపూర్‌ సిటీ, పావిజేత్‌పూర్ తాలూకాలోని అంబాపూర్ విలేజ్‌కు చెందిన 26 ఏళ్ల ధర్మేష్ రథ్వా ఇటీవల తన పొలంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకుగాను వెళ్లాడు. ఈ టైంలో అక్కడ ఉన్న ఎలుగుబంటి అతడిపై విరుచుకుపడింది.

ఎలుగుబంటి చేసిన భయంకర దాడిలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడి ముక్కు, ఎముకలు, కండరాలు, పెదవులు, కింది కనురెప్పలు, బుగ్గలు ముఖంలోని వివిధ భాగాలన్నీ తీవ్రంగా దెబ్బతిని మనిషి అసలు గుర్తు పట్టకుండా అయిపోయాడు. దాడి తర్వాత సదరు బాధితుడిని కుటుంబ సభ్యులు వడోదరలోని ఎస్‌ఎస్‌జీ ఆస్పత్రికి తరలించారు.

ఎలుగు బంటి దాడిలో యువకుడు అంధవికారంగా తయారయ్యాడు. ఇకపోతే సదరు యువకుడిని కాపాడేందుకుగాను ఎస్‌ఎస్‌జీ ఆస్పత్రి వైద్యులు కీలకమైన సర్జరీలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడొందల కుట్లు వేశారు. అలా కుట్ల ద్వారా ముఖాన్ని పునర్నిర్మించారు వైద్యులు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే ఈ వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చువుతుంటుంది. కాగా, ఎస్ఎస్‌జీ వైద్యులు ఉచితంగా సర్జరీ చేసి యువకుడికి ఊరట కలిగించారు.

Advertisement

పేషెంట్ ధర్మేష్ రథ్వా ప్రస్తుతం తన కళ్లను కదిలించగలుగుతున్నాడని, ద్రవ రూపంలో ఆహార పదార్థాలు తీసుకుంటున్నాడని వైద్యులు చెప్తున్నారు. ప్రాణానికి ఎటువంటి అపాయం లేదని, మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇకపోతే సదరు పేషెంట్‌కు ట్రీట్ మెంట్ చేయడం చాలా కష్టమైందని, ఎలుగుబంటి దాడిలో ఫేస్ మూడింట ఒక వంతు భాగం దెబ్బతిన్నదని వివరించారు వైద్యులు. ఈ క్రమంలోనే ట్రీట్ మెంట్ చాలా జాగ్రత్తగా చేసినట్లు తెలిపారు.

Read Also : chewing betel effects : వక్క పొడి వలన నోటి కేన్సర్‌తో పాటు పలు అనారోగ్య సమస్యలు..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel