Vijaya Devarakonda : విజయ్ దేవరకొండకు బాలీవుడ్ హీరోయిన్ ఫిదా.. రౌడీబాయ్‌తో అలా చేయాలంటూ హాట్ కామెంట్స్..!

Updated on: December 12, 2021

Vijaya Devarakonda : టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ గురించి చెప్పాలంటే ఎవరైనా అర్జున్ రెడ్డికి ముందు ఆ తర్వాత అంటారు. ఎందుకంటే అప్పటివరకు విజయ్ నటించిన సినిమాలు క్లాసిక్ అండ్ రొమాంటిక్.. కానీ, దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ ఫేట్‌ను ఒక్కసారిగా మార్చేసింది.

ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్.. ‘ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్ చోత్’ అంటూ బుల్లెట్ బండిపై మన రౌడీ బాయ్ యాంగ్రీగా వెళ్తున్న సీన్ అందరినీ కట్టిపడేసింది. అర్జున్ రెడ్డి మూవీ చేసిన చాలా మంది తమ పాస్ట్‌ను గుర్తుచేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసింది ఈ మూవీ.. ఇందులో మనోడి నటనకు బడా స్టార్స్ కూడా ఫిదా అయ్యారట.. ఏకంగా ఈ మూవీని నాలుగు భాషల్లో రీమెక్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు.

Vijaya Devarakonda : యూత్‌లో విజయ్‌కు మంచి ఫాలోయింగ్.. 

అయితే, ఈ మూవీ తర్వాత విజయ్ ఒక్కసారిగా హీరోయిన్ల మనసును కూడా దోచేసుకున్నాడట.. తెలుగులో కాదు ఏకంగా బాలీవుడ్‌లోనే.. మనోడు ఇంతవరకు నేరుగా బాలీవుడ్ సినిమా చేయలేదు. పెళ్లి చూపులు రాకముందు వరకు విజయ్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు క్లాసిక్ హిట్.. అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఆ తర్వాత పరుశురాం దర్శకత్వంలో వచ్చి గీత గోవిందం కూడా బంపర్ హిట్.. దీంతో విజయ్ పేరు టాలీవుడ్ లో మోత మోగిపోయింది. యూత్‌లో విజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా, రౌడీబాయ్ కాస్టూమ్స్, కొవిడ్ టైంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చిన తీరు.. మాట విధానం అందరినీ మెప్పించాయి.

Advertisement

దీంతో మనోడికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. అన్ని ఇండస్ట్రీలో విజయ్ పేరు మారుమోగింది. దీంతో బాలీవుడ్ హీరోయిన్స్ విజయపై మనసు పారేసుకుంటున్నారట.. మొన్నటివరకు మీ ఫేవరేట్ హీరో ఎవరిని అడుగగా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ విజయదేవరకొండ అంటూ ఓపెన్ అయిపోయింది. తాజాగా జాన్వీ ఫ్రెండ్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ కూడా విజయ్ అంటే ఇష్టం అని చెప్పిందట..అతనితో కలిసి సినిమా చేయాలని తన మనసులో మాట బయటపెట్టేసిందట ఈ బోల్డ్ బ్యూటీ.. ప్రస్తుతం విజయం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తున్న విషయం తెలిసిందే.

Read Also : Bigboos 5 telugu: యాంకర్ రవి ఎలిమినేషన్ పై మండిపడిన తల్లి ఉమారాణి

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel