RRR Movie Release : ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడింది.. ఎప్పడంటే?

Updated on: January 1, 2022

RRR Movie Release : జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడింది.

షెడ్యూల్ ప్రకారం.. జనవరి 7న వరల్డ్ వైడ్ RRR మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ మూవీ మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. నవంబర్ 2018లో మూవీ షూటింగ్ మొదలైంది. కరోనా దెబ్బకు షూటింగ్ పలుమార్లు బ్రేక్ వేసింది. మొదటి వేవ్ సమయంలో షూటింగ్ ఎలాగో పూర్తి చేసింది చిత్ర యూనిట్. అప్పటినుంచి RRR వాయిదాల పర్వం నడుస్తోంది. జనవరి 7న రిలీజ్ అవుతుందని అనుకున్న తరుణంలో మళ్లీ సినిమా వాయిదా పడినట్టు తెలుస్తోంది. 450 కోట్లు బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో.. ఈ టైంలో రిలీజ్ చేస్తే కలెక్షన్స్ రావడం కష్టమని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

RRR Release : ‘ఆర్ఆర్ఆర్’కు కరోనా ఎఫెక్ట్.. రిలీజ్ వాయిదా.. 

రూ.1000 కోట్ల కలెక్షన్ టార్గెట్ తో రానున్న ‘ఆర్ఆర్ఆర్’ ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడనుంది. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించారు. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 50 శాతంతోనే థియేటర్స్ నడపున్నారు. నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణాలో కూడా 50 శాతంతో థియేటర్స్ నడిపేలా ఆదేశాలు త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

కరోనా కేసుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో RRR మూవీ రిలీజ్ వాయిదా వేయాలని, 2022 ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు సమాాచారం. ఈ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Read Also : Deepthi Shanmukh Breakup : అవును.. దీప్తి.. షన్నూ విడిపోయారు..!!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel