RGV Etala Movie : ‘వెన్నుపోటు ఈటలు’ మూవీ.. అసలు విషయం చెప్పేసిన ఆర్జీవీ

Updated on: August 4, 2025
rgv etela movie : రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ సినీ డైరెక్టర్.. ట్రెండింగ్‌లో ఉండే విషయాల ఆధారంగా మూవీస్ తీస్తూ ఆయన సైతం ట్రెండింగ్‌లో ఉంటాడు. మొన్నటి వరకు క్రైం బేడెస్ స్టోరీలతో సినిమా తీసిన ఆయన.. ఇటీవలే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెడుతున్నాడు.
శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన ఆయన.. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు ఆఫర్లు తన్నుకుంటూ వచ్చాయి. కానీ రాను రాను ఆయన మూవీస్ కాన్సెప్ట్ మారిపోయింది.
Mohan Babu : ‘ఆహా’లోకి మోహన్‌బాబు వస్తున్నారా? దాని వెనకాల అల్లూ అరవింద్ ప్లాన్ ఏంటి?
ఆయన తీసిన రక్త చరిత్ర 1, 2 మూవీలు హిట్టయ్యాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయకుడు విలన్ గా చూపిస్తూ సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్‌టీఆర్ అనే మూవీని తీశాడు. ఈ మూవీ అనేక వివాదాల మధ్య విడుదలైంది. కానీ ఏపీలో మొదట్లో దీనిని రిలీజ్ చేయనివ్వలేదు. ఇక రీసెంట్‌గా తెలంగాణ రాజకీయాలను శాసించిన కొండా సురేఖ దంపతులపై మూవీ ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన షూటింగ్ సైతం మొదలైంది.
తాజాగా ఈటల రాజేందర్ కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని అందుకు సంబంధించిన విషయాలను తెలంగాణ రాజకీయ విశ్లేషకులతో మాట్లాడి సినిమా తీస్తానని చెబుతూ ఒక పోస్టర్ విడుదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్ అవుతున్నది. దీనిపై ఆర్జీవీ తాజా స్పందించారు. అదంతా ఫేక్ అని చెప్పాడు.
తన పేరుతో ఎవరో ఫాల్స్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారని చెప్పుకొచ్చారు. దానిని ఎవరూ నమ్మవద్దని, తాను అలాంటి మూవీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఈ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతూ ఈటల రాజేందర్ ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేస్తున్నది.
Keerthy Suresh : ఇకపై అలాంటి పాత్ర‌లు చేయ‌నంటున్న‌ మ‌హాన‌టి.. ఎందుకంటే.. ?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel