Mohan Babu : ‘ఆహా’లోకి మోహన్‌బాబు వస్తున్నారా? దాని వెనకాల అల్లూ అరవింద్ ప్లాన్ ఏంటి?

Updated on: August 4, 2025

Mohan Babu Web Series : మూవీస్, పాలిటిక్స్ రెండు వేరు వేరు. ఎక్కడ ఎన్ని విభేదాలున్నా.. కళామతల్లి దగ్గరకు వచ్చే సరికి అంతా కలిసిపోయి ఉండాలనేది సినీ పరిశ్రమలో ఓ రూల్‌గా అందరూ భావిస్తుంటారు. పర్సనల్ మ్యాటర్స్.. తదితర భేదాలు మనుసులో ఉంచుకుని ఇండస్ట్రీని చీల్చొద్దనే రూల్ ను అందరూ ఫాలో అవ్వాలని సినీపెద్దలు చెబుతుంటారు.

ఆ రూల్‌ను కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారు సినీ నిర్మాత అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీతో గిట్టని వారిగా పాపులర్ అయిన కొందరు స్టార్లను ఆహా వేదికగా అల్లూ అరవింద్ అందరినీ ఒకే తాటిపైకి తెస్తున్నట్టు అనిపిస్తుంది. పర్సనల్ గా ఎలాంటి విభేదాలున్నా.. వాటిని పట్టించుకోకుండా ఎంటైర్‌టైన్‌మెంట్ అనే భావనతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తున్నది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అల్లు అరవింద్ స్వయంగా బావమరిది. ఆయన ఆధ్వర్యంలోనే ‘ఆహా’ అనే ఓటీటీని కొనసాగుతున్నది. తాజాగా హీరో బాలకృష్ణతో ఓ ఇంటర్వ్యూ ప్రోగ్రాం చేయించాడు అరవింద్. ఆ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సైతం సెలబ్రేట్ చేశాడు. చిరంజీవికి, బాలకృష్ణకు మధ్య సినిమాల పరంగా, పొలిటికప్ పరంగా పోటీ ఉన్నా.. వాటిని అల్లూ అరవింద్ పట్టించుకోకుండా తన ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేశాడు. బాలయ్యను, నాగార్జునను సైతం ఒకే వేదికపైనకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారనటి టాక్. వారిద్దరిని ఆహా వైదికపైకి తీసుకురావాలని అరవింద్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుతం మోహన్ బాబుతో సైతం ‘ఆహా’ ప్రోగ్రాంకు గ్రాండ్‌గా ఇన్‌వైట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఓ తమిళ్ ప్రొడ్యూసర్ రాసిన ఓ వెబ్‌సిరీస్ కోసం మోహన్‌బాబును చీఫ్ గెస్ట్‌గా ఇన్‌వైట్ చేసి ఆయనతోనే సిరీస్‌ను లాంచింగ్ చేయిస్తే బాగుంటుందని అరవింద్ ట్రై చేస్తున్నాడట. మరి ఈ ఐడియా సక్సెస్ అవుతుందా? అందుకు మోహన్ బాబు ఒప్పుకుంటారా? లెటస్ వెయిట్ అండ్ సీ. ప్రసుతం ‘ఆహా’లో మోహన్ బాబు కూతురు లక్ష్మి ఓ ప్రోగ్రాం చేస్తున్నది. అందులోనే మోహన్‌బాబు వస్తారని టాక్?

Read Also : Keerthy Suresh : ఇకపై అలాంటి పాత్ర‌లు చేయ‌నంటున్న‌ మ‌హాన‌టి.. ఎందుకంటే.. ?

Read Also  : ChaySam Divorce Reason : చైతూ కోసం సమంత చేసిన త్యాగాలు అన్ని ఇన్నీ కావట.. విడాకుల మ్యాటర్‌లో సామ్ డెసిషన్ కరెక్టే..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel