Keerthy Suresh : ఇకపై అలాంటి పాత్ర‌లు చేయ‌నంటున్న‌ మ‌హాన‌టి.. ఎందుకంటే.. ?

Updated on: October 21, 2021

keerthy suresh movies: తెలుగు వెండితెర‌పై ఒక‌ప్ప‌టి మ‌హాన‌టి అంటే ట‌క్కున గుర్తొచ్చేది సావిత్రి. మ‌రి ఇప్పుడు మ‌హానటి అంటే గుర్తొచ్చేది ఎవ‌రంటారా ? ఇంకెవ‌రండి.. అల‌నాటి న‌టి సావిత్రి బ‌యోపిక్ ఆధారంగా వ‌చ్చిన మ‌హాన‌టి సినిమాకు పూర్తి న్యాయం చేసిన కీర్తి సురేష్‌. చ‌నిపోయిన సావిత్రి తిరొగిచ్చి న‌టించారా అన్న‌ట్టు ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింది. త‌న రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
ChaySam Divorce Reason : చైతూ కోసం సమంత చేసిన త్యాగాలు అన్ని ఇన్నీ కావట.. విడాకుల మ్యాటర్‌లో సామ్ డెసిషన్ కరెక్టే..?

నేనూ, శైలెజా సినిమా ద్వారా తెలుగులోకి అరెంగేట్రం చేసిన కీర్తి సురేష్.. అందులో రామ్ స‌ర‌స‌న న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అప్ప‌టి నుంచి వ‌రుసగా సినిమాలు చేశారు. తెలుగుతో పాటు, మ‌ల‌యాలం సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

నిజానికి 2000 సంత్స‌రంలో వ‌చ్చిన పిలాట్స్ అనే మ‌ళ‌యాలం సినిమాలో బాల న‌టిగా న‌టించింది. అందులో చ‌ర్చ్ కిడ్ అనే పాత్రలో క‌నిపించింది. ఆ త‌రువాత వ‌రుస‌గా 5 మ‌ళ‌యాలం సినిమాలో చేసి.. 2015లో నేను శైలెజా సినిమా ద్వారా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది.

Advertisement

అయితే మ‌హాన‌టి సినిమా ద్వారా లేడి ఓరియెంటెడ్ పాత్ర‌లు చేయ‌డం మొద‌లు పెట్టిన కీర్తి.. కొన్ని వ‌రుస‌గా అలాంటి పాత్ర‌లే చేయ‌డానికి ఒప్పుకుంది. ఓటీటీ ప్లాట్ ఫాంపై రిలీజ్ అయిన పెంగ్విన్‌, త‌రువాత మిస్ ఇండియా సినిమాలో క‌నిపించారు. కానీ ఆ సినిమాలు పెద్ద‌గా హిట్ కాలేదు. అలాగే గుడ్ ల‌క్ సినిమాలో అలాంటి పాత్ర‌లోనే త‌ను న‌టించినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమా రిలీజ్ కాలేదు.

దీంతో ఇక నుంచి లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేయ‌బోన‌ని, త‌న‌కు అలాంటి పాత్ర‌లు క‌లిసి రావ‌డం లేద‌ని చెబుతోంది ఈ మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఆమె తెలుగులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌, నాని ద‌స‌రా సినిమాలో న‌టిస్తోంది.
Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!    

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel